Jani Master: జానీ మాస్టర్ పై రేప్ కేసు.. ఎఫ్ఐఆర్ లో సంచలన ఆరోపణలు..

Jani Master: నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​.. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు,తమిళ, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు. తన కెరీర్ లో టాప్ స్పీడ్ తో దూసుకెళ్తున్న జానీ మాస్టర్‌కు బ్రేకులు పడ్డాయి. ఎవరూ ఊహించని విధంగా ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కాఫీలో సంచలనలు ఆరోపణలు వెలుగు చూశాయి. ఇంతకీ ఆ కేసు పూర్వపరాలేంటో ..

ప్రముఖ సినీ డ్యాన్సర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడనున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Rape Case filed on Choreographer Jani Master at Narsingi Police Station Women Dancer Sensational allegations in FIR

తాజాగా విడుదలైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. జానీ మాస్టర్ 2019 నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న ఓ యువ డాన్సర్ ఆరోపించింది. 2019 లో ఢీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడనీ, ఆ తరువాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. అవుట్ డోర్ షూటింగ్ పేరిట చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు పేర్కొంది.

అదే సమయంలో సంచలన ఆరోపణలు చేసింది. మత మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడనీ, పలు మార్లు దాడి చేశారని పేర్కొంది. తన లైంగిక కోరికలు తీర్చడానికి తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే.. ఇండస్ట్రీలో లేకుండా చేశానని భయాబ్రంతులకు గురి చేశాడని ఆరోపించింది. జాని మాస్టర్ భార్య కూడా తనకు సహకరించేదనీ, ఆమె కూడా తనపై దాడి చేసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది బాధితురాలు.

మహిళా కొరియాగ్రాఫర్ పాల్పడ్డాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 376 (రేప్), నేరపూరితంగా బెదిరింపులు ( సెక్షన్ 506), ఉద్దేశపూర్వకంగా గాయపరచడం (323 సెక్షన్ (2)(N)) కింద కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు . అయితే దీనిపై ఇంకా జానీ మాస్టర్ స్పందించలేదు.

గతంలో కూడా జాని మాస్టర్‌పై పోలీసు కేసు నమోదు అయ్యింది. 2015లో మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది మేడ్చల్ కోర్టు.తాజాగా ఈ కేసు నమోదు కావడం మరింత సంచలనం రేపింది.

More from Filmibeat

Read more about: jani master rape case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X