జానీ మాస్టర్‌పై రేప్ కేసు.. పలుమార్లు లైంగిక దాడి అంటూ మహిళ ఫిర్యాదు
తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమతోపాటు హిందీలో కూడా రాణిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా అతడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సినీ డ్యాన్సర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే తనపై పలుమార్లు అత్యాచారం జరిపారు. తనకు అతడి నుంచి రక్షణ కల్పించాలి. తనకు న్యాయం చేయాలని ఓ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్‌లో జరిగే షూటింగ్స్, అవుట్ డోర్ షూటింగుల సమయంలో తనపై లైంగిక దాడి చేశారు. నార్సింగిలోని తన ఇంటిలో కూడా పలుమార్లు అత్యాచారం చేశాడు అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా కొరియాగ్రాఫర్ ఫిర్యాదును తీసుకొన్న పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం సిద్దమయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 376 (రేప్), నేరపూరితంగా బెదిరింపులు ( సెక్షన్ 506), ఉద్దేశపూర్వకంగా గాయపరచడం (323 సెక్షన్ (2) (N)) కింద కేసు నమోదు చేశాం అని నార్సింగి పోలీసులు మీడియాకు వెల్లడించారు.
గతంలో కూడా జాని మాస్టర్‌పై పోలీసు కేసు నమోదు అయ్యింది. 2015లో మహిళపై దాడి కేసులో ఆయనపై ఆరోపణలు రాగా.. మేడ్చల్ కోర్టు విచారించి అతడికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది. తాజాగా ఈ కేసు నమోదు కావడం మరింత సంచలనం రేపింది.
జానీ మాస్టర్ ప్రస్తుతం సినీ రంగంతోపాటు రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నాడు. గత ఎన్నికల ముందు ఏపీలోని జనసేన పార్టీలో చేరి ప్రచార బాధ్యతలు నిర్వహించాడు. కొరియోగ్రాఫర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా పనిచేస్తూ.. సామాజిక సేవలో ఉన్నాడు. తాజా ఆరోపణలపై ఆయన ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకొన్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు అగ్ర హీరోలకు ఆయన నృత్యాలు సమకూరుస్తున్నారు. ఆయన చేసిన పాటలు అత్యంత పాపులారిటీని సాధించాయి.


Click it and Unblock the Notifications











