యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు.. నగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్
యువ హీరో, యూట్యూబర్ హర్ష సాయి కేసు విషయంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకొన్నది. బిగ్‌బాస్ కంటెస్టెంట్, నిర్మాతగా గుర్తింపు పొందిన యువతి ఆయనపై లైంగిక దాడి ఆరోపణలతో కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. జానీ మాస్టర్ కేసు ఇంకా మరిచిపోకముందే అదే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మరో రేప్ కేసు నమోదు కావడం భారీ చర్చకు దారి తీసింది. ఈ కేసులో చోటు చేసుకొన్న వివరాల్లోకి వెళితే..
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న యూట్యూబర్ హర్షసాయిపై చీటింగ్ కేసు బాధితురాలు నమోదు చేసిందనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే కేవలం చీటింగ్ కేసు మాత్రమే కాకుండా లైంగిక దాడి, బ్లాక్ మెయిల్ కూడా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

నార్సింగి పోలీసులకు బాధిత సెలబ్రిటీ చేసిన ఫిర్యాదు ప్రకారం.. తాను నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా పెడుతానని బెదిరించాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. నా నుంచి పెద్ద ఎత్తున్న డబ్బు గంజాడు అని ఫిర్యాదులో పేర్కొన్నది. తన అడ్వకేట్ సహయంతో వచ్చి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. హర్షసాయి తన అసభ్య వీడియోలతో బెదిరించాడని ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు పెట్టాం. ఐపీసీ 376, 354 సెక్షన్ల కింద కేసు పెట్టామని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications











