RAPO19 పూజా కార్యక్రమాలు.. రామ్ లుక్ అదుర్స్
ఇస్మార్ట్ హీరో రామ్ కొత్త సినిమాను ప్రారంభించేశాడు. RED సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రామ్ కొత్త ప్రాజెక్ట్ విషయంలో కాస్త ఆలస్యం చేశాడు. సంక్రాంతికి మంచి హిట్ కొట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్.. మంచి స్వింగ్‌లో ఉన్నాడు. అయితే తన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వడానికి మాత్రం అభిమానులను ఎదురుచూసేలా చేశాడు. మొత్తానికి నేడు అప్డేట్ ఇవ్వడమే కాకుండా అందరూ ఆశ్చర్యపోయేలా సినిమాను ప్రారంభించేశాడు కూడా.
తమిళ దర్శకుడితో రామ్ సినిమా ఉండబోతోందని గత కొన్ని రోజులుగా రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రూమర్లే నేడు నిజమయ్యాయి. తమిళ దర్శకుడు లింగుసామి కాంబోలో రామ్ నటించబోతోన్నాడు. శ్రీనివాస చిత్తూరు నిర్మాతగా రాబోతోన్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైద్రాబాద్‌లో జరిగాయి. ఈ ఈవెంట్‌కు గోపీచంద్, సంపత్ నంది వంటి వారు హాజరయ్యారు.

సీటీమార్ యూనిట్ స్పెషల్‌గా వచ్చి రామ్ చిత్రానికి కంగ్రాట్స్ తెలిపాడు. లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించింది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్‌కు వచ్చిన రామ్.. తన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మిగతా వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఏప్రిల్‌లో సినిమా షూటింగ్ ప్రారంభయ్యేట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











