విమానం రెక్కపై షూటింగ్.. ప్రమాదంతో అక్కడికక్కడే మృతి చెందిన రాపర్!
కెనడాకు చెందిన ప్రముఖ టాపర్ జాన్ జేమ్స్(33) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విమానం రెక్కపై సాహసోపేతమైన షూటింగ్ లో భాగంగా ప్రమాదం జరగడంతో జేమ్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రిటిష్ కొలంబియాలోని వెర్నాన్ లో ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ జరిగింది.
ఈ షూటింగ్ లో జేమ్స్ పాల్గొన్నాడు. కదులుతున్న విమానం రక్కపై నిల్చుని సాహసోపేతమైన షాట్ చిత్రీకరించడానికి ప్రయతించారు. ఈ వీడియో కోసం జేమ్స్ ముందుకుగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

పూర్తి ఆత్మవిశ్వాసంతో షూటింగ్ కు సిద్ధం అయ్యాడు. కానీ విమానం రెక్క వంగి ఉండడంతో జేమ్స్ అదుపు తప్పాడు. పారాచూట్ ఓపెన్ చేసే లోపే ఘోరం జరిగిపోయింది. జేమ్స్ త్వరయా కింద పడిపోవడంతో తీవ్రగాయాలతో మృతి చెందాడు.


Click it and Unblock the Notifications











