తొలి అనుభవం.. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది.. రాశీ ఖన్నా వైరల్ పోస్ట్
సాధారణంగా ఏ వ్యక్తి అయినా తొలి అనుభవంలో కాస్త టెన్షన్‌గా ఫీల్ కావడం సహజమైన సంఘటనే. అయితే ఇందుకు తాను కూడా అతీతం కాదని అంటోంది రాశీ ఖన్నా. అందచందాలతో మాయ చేయడమే గాక, తన గాత్రంతో కూడా మెస్మరైజ్ చేయగలదు ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సారి మరో కొత్త ప్రయత్నం చేస్తోంది రాశీ. తన కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ తాను డబ్బింగ్ చెబుతున్న ఓ పిక్ షేర్ చేసింది రాశీ. ఈ మేరకు.. తొలిసారి తాను డబ్బింగ్ చెప్పుకున్నానని, చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుందని పేర్కొంది రాశీ ఖన్నా. ఈ పోస్ట్ చూసి ఆల్ ది వెస్ట్ చెబుతున్నారు ఆమె ఫ్యాన్స్. బెల్లం శ్రీదేవి అన్నింటా ముందే అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. అందులో రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా కూడా మరో ముగ్గురు హీరోయిన్లుగా కనిపించనున్నారు.
యూత్ టార్గెట్‌గా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాను లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని సన్నాహాలు చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ మరింత వేగవంతం చేసి డిసెంబర్ 20వ తేదీనే చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.


Click it and Unblock the Notifications











