వెంకీ మామకు హగ్ ఇచ్చిన రాశి ఖన్నా.. ఫ్యాన్ గర్ల్ అంటూ!

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా తాజాగా ఈ చిత్ర సెట్స్ పై విక్టరీ వెంకటేష్ తో దిగిన ఓ పిక్ అభిమానులతో పంచుకుంది రాశి ఖన్నా. ఇందులో వెంకీని కౌగిలించుకొని కనిపించింది రాశీ. ఈ మేరకు ఫ్యాన్ గర్ల్ అని పేర్కొంటూ వెంకటేష్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఈ పిక్ చూసి వెంకీ అభిమానులు మురిసిపోతున్నారు. లైకులు, రీ ట్వీట్స్ తో హోరెత్తిస్తున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అయింది.

Rashi Khanna with venkatesh On the sets of Venkymama

ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాలో నాగ చైతన్య బాగా కష్టాలొస్తాయట. ఆ కష్టాలన్నీ తన మామ వెంకటేష్ వల్లనే ఉత్పన్నమవుతాయట. అయితే వాటి నుంచి బయటపడే క్రమంలో నాగ చైతన్య జ్యోతిష్యుల చుట్టూ తిరగాల్సి వస్తుందట. ఈ నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశాలతో సినిమా సాగిపోతుందని అంటున్నారు. ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసే కామెడీ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ముల్టీస్టారర్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X