నేను కనపడే విధానాన్ని చూడకండి.. రష్మీ పోస్ట్ వైరల్.. గ్రేట్ అంటూ నెటిజన్ల ప్రశంసలు
జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన రష్మీ.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బుల్లితెరపై వచ్చిన క్రేజ్‌తో వెండితెరపైనా అవకాశాలు సంపాదించుకుంది. అయితే అక్కడ అనుకున్నంతగా రాణించలేకపోయింది. తనకు కలిసి వచ్చిన బుల్లితెరపైనే ప్రస్తుతం ఫోకస్ పెట్టింది రష్మీ. బుల్లితెర షోలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ రష్మీ చేసిన పని ఏంటో ఓ సారి చూద్దాం.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్..
రష్మీ చేసే వ్యాఖ్యలు, ఆమెపై వచ్చే కామెంట్స్ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఆమె ఏదో ఒకటి పోస్ట్ చేయడం, వాటికి నెగెటివ్ కామెంట్స్ రావడం జరుగుతూనే ఉంటుంది. అలాంటి వాటికి సంజాయిషీ ఇచ్చుకోవడం, మళ్లీ అవి వైరల్ అవడం నిత్యం జరుగుతూనే ఉంటుంది.

కరోనా టైమ్‌లో షాపింగ్ మాల్..
కరోనా విజృంభిస్తున్న సమయంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఏంటని రష్మీపై గతవారం ట్రోల్స్ నడిచాయి. అయితే ఎవరూ సరిగా రూల్స్ పాటించడం లేదని, ముందుగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం తాను వెళ్లాల్సి వచ్చిందని, అన్ని సరిగ్గా ఉంటే ఇలాంటి సమయంలో ఓపెనింగ్‌కు ప్రభుత్వ అనుమతి ఎలా లభించిందని ప్రశ్నించింది.
పెట్స్‌పై ప్రత్యేక శ్రద్ద..
రష్మీకి మూగ జీవాలపై ప్రేమ ఎక్కువ. అందుకే రష్మీ వాటికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఎక్కడైనా కుక్క పిల్లలకు హాని జరుగుతూ ఉంటే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ మధ్యహోలీ సమయంలోనూ స్పందిస్తూ.. కుక్కలపై రంగులు చల్లకండని సూచించింది.

తాజాగా వాటి కోసమే..
కరోనా సమయంలో వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రహించిన రష్మీ.. వాటికోసం ఆహారాన్ని పంపిణీ చేసింది. ఈ మేరకు రాబిన్ హుడ్ఆర్మీ సాయాన్ని తీసుకుంది. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ.. నేను కనిపించే విధానాన్ని పట్టించుకోకండి.. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యలో తిరుగుతూ ఇదంతా నేను చేయలేను.. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. వారు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు.. అంటూ పోస్ట్ చేసింది. రష్మీ చేస్తోన్న ఈ కార్యక్రమానికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. గ్రేట్ మేడమ్ అంటూ రష్మీని పొగిడేస్తున్నారు.


Click it and Unblock the Notifications











