Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దిల్ కీ రాణి అందాల వాణి.. రష్మీ పిక్ వైరల్
జబర్దస్త్ వేదిక నుంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. జబర్దస్త్ షోలో అందాల ఆరబోతతో కుర్రకారు ఫిదా చేసింది. ఇక అలా ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో హెస్ట్‌గా, ఢీషోలో స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మీకి బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉంది. వెండితెరపై అడపాదడపా చిత్రాలను చేస్తూ వచ్చిన రష్మీకి అక్కడ సరైన గుర్తింపు రాలేదు. కానీ బుల్లితెరపై మాత్రం గ్లామరస్ క్వీన్‌గా స్టార్డంను అందుకుంది. మళ్లీ మధ్యలో వెండితెరపై వెలగాలని ప్రయత్నించింది.
గ్లామర్ పాత్రలు, స్కిన్ షో క్యారెక్టర్స్ రావడంతో రష్మీని వెండితెర ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. ఇక గుంటూరు టాకీస్‌లో సువర్ణ చేసిన పాత్రకు ఎంతటి నెగెటివ్ టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగానే ఉంటుంది. మంచి క్యారెక్టర్ పడితేనే సినిమా చేస్తానని చెప్పిన రష్మీ ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఈ మధ్య బాగా పాపులర్ అయిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో రష్మీ ఓ మంచి పాత్రను పోషిస్తోందని తెలుస్తోంది.

నందు ఆ మద్య బీబీ అంటూ నానా రచ్చ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. BB అంటే అంతా బిగ్ బాస్ అనుకున్నారు గానీ.. చివరకు అది తన కొత్త ప్రాజెక్ట్ అని బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశాడు. రీసెంట్‌గా నందు బర్త్ డేసందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా బాగానే వైరల్ అయింది. ఇక తాజాగా ప్రదీప్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన రష్మీ లుక్ ఆకట్టుకుంటోంది. పోతురాజు (నందు క్యారెక్టర్ పేరు) గాడి లవర్ వాణి అంటూ రష్మీ పోస్టర్‌ను విడుదల చేశారు. దిల్ కీ రాణి అందాల వాణి అంటూ చెప్పిన పోతురాజు చెప్పిన సమయానికి అప్డేట్ ఇచ్చాడు.