రష్మీపై ప్రశంసలు, అనసూయపై బూతులు.. అలా ధూషించడం తప్పు.. నెటిజన్‌కు యాంకర్ రిప్లై

సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ, అనసూయ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక పోస్ట్ చేయడం, వాటికి నెటిజన్స్ ఏదో ఒక వల్గర్ కామెంట్ చేయడం మళ్లీ దానిపై పెద్ద రచ్చ చేయడం లాంటివి నిత్యం జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ రష్మీని పొగుడుతూ.. అనసూయను తిట్టాడు. ఈ ట్వీట్‌కు రష్మీ ఇచ్చిన రిప్లై అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే రష్మీ.. ప్రతీ విషయంపై స్పందిస్తూ ఉంటుంది. సామాజిక సమస్యలపైనా రియాక్ట్ అవుతూ.. పెట్స్ గురించి అందరికీ అవగాహన కలిగిస్తూ ఉంటుంది. నెటిజన్స్ వేసే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. ఎవరైనా ఘాటుగా స్పందిస్తే అదే రీతిలో కౌంటర్ కూడా వేస్తుంటుంది.

అనసూయ సైతం అదే బాటలో..

అనసూయ సైతం అదే బాటలో..

అనసూయ సైతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే రష్మీ, అనసూయకు ఒకటే తేడా. నెటిజన్స్ కౌంటర్స్, కామెంట్స్‌కు రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేసేస్తుంది అనసూయ. రష్మీ మాత్రం వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది.

తాజాగా ఉగాది శుభాకాంక్షలు..

రష్మీ తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగు ఆచారాలు, సంప్రదాయాలు, పద్దతులను పాటిస్తూ ఉంటుంది. ప్రతీ పండగకు విషెస్ చెబుతూ ఉంటుంది. అలానే ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు రష్మీ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.

Recommended Video

Anchor Anasuya Vs Anchor Manjusha In Jabardasth Comedy Show
క్రిస్మస్‌కు చెబుతుంది, ఉగాదికి చెప్పదు..

క్రిస్మస్‌కు చెబుతుంది, ఉగాదికి చెప్పదు..

రష్మీ చేసిన ఉగాది పోస్ట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ.. సంప్రదాయాలను పాటించే మీరంటా నాకు చాలా గౌరవం, అయితే అనసూయ మాత్రం క్రిస్మస్‌కు విష్ చేస్తుంది.. ఉగాది మాత్రం చేయదంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ కామెంట్‌కు రష్మీ రిప్లై ఇస్తూ.. సర్ మీ భాష.. మీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు మీకుంది కానీ ఇలాంటి భాషను వాడకూడదంటూ సూచించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X