twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైవ్‌లో కన్నీరుమున్నీరైన రష్మీ.. వాటిపై దయచూపండని వేడుకున్న యాంకర్

    |

    బుల్లితెరపై యాంకరింగ్‌కు కొత్త గ్లామర్ అద్దిన భామ రష్మీ గౌతమ్. అప్పటి వరకు అనసూయ తన అందాలతో నడిపించుకుంటూ వచ్చిన జబర్దస్త్‌ను రష్మీ పరుగులు పెట్టింది. బుల్లితెరపై గ్లామర్‌ను ఒలకబోస్తూ.. వెండితెరపైనా అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే అక్కడ అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయినా సరే బుల్లితెరపై రష్మీ అంటే ఓ సెక్షన్ ఆడియన్స్‌కు ఎప్పుడూ క్రేజే.

    తెరపై రష్మీ, నిజ జీవితంలో రష్మీ వేరు..

    తెరపై రష్మీ, నిజ జీవితంలో రష్మీ వేరు..

    తెరపై కనిపించే రష్మీకి, నిజ జీవితంలో కనిపించే రష్మీకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తెరపై ఎంతో చలాకీగా ఉండే రష్మీ.. రియల్ లైఫ్‌లో ఎంతో సెన్సిటివ్‌గా ఉంటుంది. మూగజీవాల పట్ల అమితమైన ప్రేమను ప్రదర్శిస్తూ.. వాటి గురించి పరితపిస్తూ ఉంటుంది.

    రంగులు చల్లకండి..

    రంగులు చల్లకండి..

    రష్మీకి మూగ జీవాలపై ప్రేమ ఎక్కువ. అందుకే రష్మీ వాటికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. ఎక్కడైనా కుక్క పిల్లలకు హాని జరుగుతూ ఉంటే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ మధ్యహోలీ సమయంలోనూ స్పందిస్తూ.. కుక్కలపై రంగులు చల్లకండని సూచించింది.

    కరోనా కష్టకాలంలో మూగజీవాలను..

    కరోనా కష్టకాలంలో మూగజీవాలను..

    కరోనా కష్టకాలంలో మూగజీవాల ఇబ్బందులను గ్రహించిన రష్మీ.. వాటికోసం ఆహారాన్ని పంపిణీ చేసింది. ఈ మేరకు రాబిన్ హుడ్ఆర్మీ సాయాన్ని తీసుకుంది. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ.. నేను కనిపించే విధానాన్ని పట్టించుకోకండి.. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యలో తిరుగుతూ ఇదంతా నేను చేయలేను.. ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. వారు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు.. అంటూ పోస్ట్ చేసింది.

    Recommended Video

    Netizen Bad Words On Anasuya, Rashmi Gautam Counter
    లైవ్‌లో కన్నీరుమున్నీరు

    లైవ్‌లో కన్నీరుమున్నీరు

    తాజాగా లైవ్‌లోకి వ‌చ్చిన రష్మి..లాక్ డౌన్ వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న మూగ‌జీవాల ప‌రిస్థితిని త‌ల‌చుకొని కన్నీరుమున్నీరైంది. లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారని. పేద కార్మికులు, కూలీలు స‌మ‌యానికి తిండి లేక ఇబ్బంది ప‌డుతున్నారని చెప్పుకొచ్చింది. అలానే మూగ జీవాలు ఆవులు, కుక్క‌లు, పిల్లుల‌ లాంటివి కూడా ఆహారం లేకుండా అల‌మ‌టిస్తున్నాయని మాన‌వ‌తా దృక్ప‌థంతో మూగ‌జీవాల ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ క‌న్నీరు పెట్టుకుంది.

    English summary
    Rashmi Gautam Cries About Pets In Lockdown. Rashmi Gautam About Pets In Coronavirus Epidemic. She Supplies Food For Pets During Coronavirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X