రష్మి హీరోయిన్‌గా మరో మూవీ ఖరారైంది, హీరో ఎవరంటే?
తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన రష్మి...తన అందం, టాలెంటుతో హీరోయిన్‌గా పలు అవకాశాలు సంపాదించలో సక్సెస్ అయింది కెరీర్ పరంగా విజయాలు అందుకోలేక పోతోంది. 'గుంటూరు టాకీస్' తర్వాత రష్మి దశ తిరిగిందనే చెప్పొచ్చు. ఈ మూవీలో రష్మి అందాల ప్రదర్శన, ముద్దు సీన్లు ఆమెకంటూ ఒక ఇమేజ్ తెచ్చిపెట్టడంతో పాటు పాపులారిటీ పెరగడానికి కారణమైంది.
అయితే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన రోల్స్ చేస్తూ ముందుకు వెళ్లాలని భావించిన రష్మికి ఆశించిన స్థాయిలో సక్సెస్ అందడం లేదు. తాజాగా రష్మి హీరోయిన్‌గా మరో మూవీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందులో నందు హీరోగా నటించబోతున్నాడు. షార్ట్ ఫిల్మ్ మేకర్ విరాట్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శివరంజని తర్వాత నందు, రష్మి కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది.

రొమాంటిక్ కామెడీ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రానకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో రష్మి విలేజ్ అమ్మాయిగా కనిపించబోతోంది. ఇప్పటి వరకు రష్మి చేసిన పాత్రలకు భిన్నంగా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో అంతా కొత్తవారే నటిస్తున్నారు. అంతరిక్షం, దొరసాని చిత్రాలకు పని చేసిన ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











