twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్‌లోనూ రష్మీ అలా.. నీ మీదున్న గౌరవం పోయిందంటూ యాంకర్‌పై నెటిజన్ ఫైర్

    |

    కరోనా ఎఫెక్ట్ దేశ మంతా అట్టుడికపోతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు అన్ని కార్యకలాపాలను ఆపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాసంస్థలు, థియేటర్స్, మాల్స్, పబ్స్, క్లబ్స్ వంటి వాటిని క్లోజ్ చేయించింది. తెలంగాణ, ఏపీలోనూ ఈ మేరకు ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేసింది. అయితే యాంకర్ రష్మీ.. తాజాగా ఓ కొత్త షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దచర్చకు దారి తీసింది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

    లెనిల్ హౌస్ ఓపెనింగ్..

    లెనిల్ హౌస్ ఓపెనింగ్..

    రాజమండ్రిలో లెనిన్ హౌస్ 17వ షోరూం ప్రారంభించబోతోన్నామని ట్విట్టర్ వేదికగా రష్మీ నిన్న ప్రకటించింది. ఇక దీంతో సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్దం నడించింది. బయట కరోనా అంటూ అంతా సీరియస్‌గా ఉంటే.. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటావా అని ఫైర్ అయ్యారు నెటిజన్స్.

     ట్వీట్లతో దాడి..

    ట్వీట్లతో దాడి..

    సామాజిక బాధ్యత లేదా, ఇంత కూడా కామన్ సెన్స్ లేదా అంటూ రష్మీని టార్గెట్ చేశారు. బయట తిరగొద్దని ప్రభుత్వాలు చెబుతున్నా.. మీరు మాత్రం అలా చేస్తారా? అంటూ కామెంట్స్ చేయసాగారు. అయితే ఇందులో కొందరు మాత్రం రష్మీకే మద్దతు తెలిపారు. ప్రభుత్వాలు అన్నింటిని మూసి వేయాలని చెప్పారు గానీ రియాల్టీలో అలా లేదని రివర్స్ కౌంటర్స్ వేశారు.

    మాల్ ఓపెన్ చేసిన రష్మీ..

    నేడు ఉదయం లెనిన్ హౌస్‌ను ఓపెన్ చేసిన రష్మీ.. అనంతరం లైవ్‌లోకి వచ్చి అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చింది. కరోనాను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని, మొన్న మండపేటలో మాల్ ఓపెన్ చేయడానికి వెళ్తే వందల మంది వచ్చారని,అది చూసి తాము షాక్ అయ్యామని తెలిపింది. కరోనాపై ఏ ఒక్కరికీ అవగాహన లేదని, తాము ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తాలు గనుక వాయిదా వేయలేకపోయామని చెప్పుకొచ్చింది. రాజమండ్రి పోలీసుల సహాకారంతో తక్కువ మందితో మాల్‌ను ఓపెన్ చేశానని పేర్కొంది.

    Recommended Video

    Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !
    గౌరవం పోయింది..

    గౌరవం పోయింది..

    లైవ్‌లో మాట్లాడిన రష్మీ.. ప్రభుత్వాల మీద, ప్రజల మీద కామెంట్స్ చేసింది. ఏ ఒక్కరూ సీరియస్‌గా లేరని, మన దేశంలో మ్యాండేటరి చేస్తే తప్పా దేన్నీ పాటించరని, ప్రజలను, ప్రభుత్వాలను టార్గెట్ చేసింది. రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలకు నెటిజన్ స్పందిస్తూ.. మీరు చేసిన వ్యాఖ్యలకు మీపై ఉన్న గౌరవం పోయిందని ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన రష్మీ.. అన్నీ సక్రమంగా ఉంటే.. అందరూ సీరియస్‌గా తీసుకుని ఉంటే.. మాకు షాప్ ఓపెనింగ్‌కు పర్మిషన్ వచ్చేదే కాదంటూ రిప్లై ఇచ్చింది.

    English summary
    Rashmi Gautam Lenin House Opening Creates Row On Social Media. Netizens Trolled Her That In Corona Time Why You Are Come To Open A Shopping Mall.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X