భార్యభర్తల మధ్య రష్మీ చిచ్చు పెట్టిందట.. గొడవ పెట్టుకుందామా?.. నందు, గీతామాధురి రియాక్షన్స్ వైరల్
గీతా మాధురి, నందు, రష్మీ గౌతమ్ ఈ మధ్య ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. నందు-రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటే.. గీతా మాధురి మాత్రం బిగ్ బాస్ 4 అప్డేట్స్, ఎవరికి సపోర్ట్, ఎవరి ఓట్లు వేయాలి, ఎపిసోడ్ ఎలా జరిగింది? దాని మీద అభిప్రాయం ఏంటి? ఇలా ఎన్నో రకాలుగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం ఈ ముగ్గురు ఒకేసారి, ఒకే వార్త వల్ల వైరల్ అవుతున్నారు.

ట్రోల్స్, మీమ్స్..
నందు మొదటి నుంచి ట్రోల్స్, మీమ్స్‌ను లైట్ తీసుకుంటాడు. ఇంకా పైపెచ్చు వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తన సవారి సినిమాపై ఎక్కువ ట్రోల్స్ చేసిన వారికి బహుమతులు, ట్రీట్ కూడా ఇచ్చాడు. తాజాగా కూడా ఇాలాంటి ఓ కాన్సెప్ట్ పెట్టాడు.

పదివేల బహుమతి..
BB అంటూ తన సినిమాను బాగానే ప్రమోట్ చేసుకున్న నందు.. ఫస్ట్ లుక్, టీజర్లతో దుమ్ములేపాడు. తాజాగా మరో అడుగు ముందుకు వేశాడు. ఈ సినిమాపై ఎవరైతే క్రియేటివ్‌గా మీమ్స్ చేస్తారో వారికి పదివేలు క్యాష్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించాడు. అలా అంత స్పోర్టీవ్‌గా తీసుకుంటాడు. తాజాగా నందు కంట ఓ వెరైటీ వార్త కనబడింది.

రష్మీ చిచ్చు పెట్టిందట..
యూట్యూబ్ చానెల్‌లో హెడ్డింగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పైన ఒకలా ఉంటుంది.. వీడియో మొత్తం చూస్తే ఇంకోలా ఉంటుంది. నందు గీతా మాధురి మధ్య రష్మీ చిచ్చు పెట్టిందట. ఇదే హెడ్డింగ్‌తో ఓ వీడియోను పోస్ట్ చేసిన నందు ఓ సెటైర్ వేశాడు.

ముగ్గురి రియాక్షన్ వైరల్..
ఈ వీడియో థంబ్ నెయిల్‌ను స్క్రీన్ షాట్ తీసి నందు పోస్ట్ చేస్తూ అదిరిపోయే సెటైర్ వేశాడు. ‘మీ బొంద రా, మీ బొంద , ఇది చూసావా ? ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం మనం గొడవ పడాలి అనుకుంటా' అని గీతా మాధురిని ట్యాగ్ చేశాడు. ఇక గీతా మాధురి ఊరుకుంటుందా. ఆమె కూడా తన స్టైల్లో గట్టిగా ఇచ్చిపడేసింది.
Recommended Video

వీళ్లు మారరు..
గీతా మాధురి స్పందిస్తూ.. చూశా బుజ్జి. కరోనా కి అయినా వాక్సిన్ వస్తుంది ఏమో కానీ ఈ థంబ్ నెయిల్ ఫెలోస్ మాత్రం చేంజ్ అవ్వరు.. మొత్తానికి మనం అయితే గొడవపడదాం కదా అని కామెంట్ చేసింది. ఏంటో వీళ్ళ బాధ అని రష్మీ సైతం యూట్యూబ్ వీడియోల పైత్యానికి కౌంటర్ వేసింది..


Click it and Unblock the Notifications











