twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమించేవారు, ద్వేషించేవారు అందరూ రండి.. వారికి తెలిసేలా చేద్దాం.. రష్మీ కామెంట్స్

    |

    కరోనా వైరస్.. ఈ ఒక్క పేరు దేశవిదేశాలకు కునుకులేకుండా చేస్తోంది. శర వేగంగా విస్తరిస్తోన్న కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికీ ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టకపోవడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు మాత్రం సలహాలు, సూచనలు ఇవ్వడం, పాటించడం మాత్రమే ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ నిర్వర్తించాల్సిన బాధ్యత. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. నేడు జనతా కర్ఫ్యూను పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు.

    కరోనా జీవితకాలం పన్నెండు గంటలు..

    కరోనా జీవితకాలం పన్నెండు గంటలు..

    కరోనా ఒకరిని నుంచి మరొకరికి సోకుతుండటంతో ఈ గొలుసును అరికట్టేందుకు పద్నాలుగు గంటలపాట స్వీయ నిర్భందం విధించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చాడు. వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలే కావడంతో.. పద్నాలుగు గంటలు ఇంటి పట్టునే ఉంటే.. కరోనాను నియంత్రించే అవకాశం ఉందని దేశ ప్రజలకు సూచించాడు.

    కదిలిన తారాగణం..

    కదిలిన తారాగణం..

    ప్రజలందరికీ కరోనాపై అవగాహన కలిగించేందుకు, వైరస్‌ను అరికట్టేందుకు ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూపై ప్రజలకు అర్థమయ్యేలా, అందరూ పాల్గొనేలా తమ వంత సందేశాలిచ్చారు స్టార్ హీరోలు. అమితాబ్, ఆమీర్ నుంచి మొదలుకొని చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, రజినీకాంత్ వంటి వారంతా జనతా కర్ఫ్యూకు మద్దతుగా నిలిచారు.

    ఐదగంటలకు కరతాళధ్వనులు..

    కరోనా వైరస్‌ ధాటికి తట్టుకుని సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిని ప్రశంసించాల్సిన అవసరముందని ప్రధాని పిలుపునిచ్చాడు. వారి సేవలను గుర్తించాలని, వారిని స్మరించుకోవాలని అందుకు గానూ దేశ ప్రజలంతా సాయంత్రం ఐదు గంటలకు కరతాళ ధ్వనులు చేయాలని పేర్కొన్నాడు.

    Recommended Video

    Rashmi Gautam Supports Sreemukhi || శ్రీముఖి కి రష్మీ సపోర్ట్ !
    అందరూ రండి వారికి తెలిసేలా చేద్దాం..

    అందరూ రండి వారికి తెలిసేలా చేద్దాం..

    ఈ మేరకు సాయంత్రం ఐదు గంటకు రష్మీతో కలిసి లైవ్‌లోకి వస్తానని శ్రద్దా దాస్ ప్రకటించింది. రష్మీ కూడా స్పందిస్తూ.. ద్వేషించేవారు, ప్రేమించేవారు అంతా రండి.. సాయంత్రం ఐదు గంటలకు కరతాళ ధ్వనులు చేద్దాం.. వారి సేవలను మనం గుర్తిస్తున్నామని, వారిని మనం ఎంత గౌరవిస్తున్నామో వారికి తెలిసేలా చేద్దామని, మీరూ లైవ్‌లో పాల్గొనండని తెలిపింది. తామంతా ఐదుగంటలకు లైవ్‌లోకి వస్తామని తెలిపింది.

    English summary
    Rashmi gautam On Janata Curfew And Clap for Doctors. Hello my twitter haters and lovers Join me live on my insta with few of my friends I’ll be accepting as many live requests as possible Let’s clap and ring bells for our unsung hero’s and let them know we respect and appreciate them at 5pm For more info check out my insta page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X