ఒక్క దర్శకుడు కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు.. డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన రష్మి

Recommended Video

Rashmi Gautam Opens Voice About Her Film Career || Filmibeat Telugu

బుల్లితెర యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి.. వెండితెరపై కూడా తన సత్తా చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈ భామ.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. అయితే తనకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి కానీ తానేంటో నిరూపించుకునే సరైన పాత్ర రావడం లేదని అంటోంది రష్మి. మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని చెబుతోంది. వివరాల్లోకి పోతే..

 చేస్తే దానికోసం.. లేదంటే డబ్బు కోసం

చేస్తే దానికోసం.. లేదంటే డబ్బు కోసం

సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతీ నటి కోరుకుంటుంది. కానీ ఒక్కోసారి కొందరికి సరైన పాత్రలు లభించవు. అలా అని నటించక పోతే కుదరదు. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది రష్మి. ఈ నేపథ్యంలో.. సినీ ఇండస్ట్రీలో అయితే డ‌బ్బుల కోసం.. లేదంటే మ‌న‌సుకు న‌చ్చే పాత్ర‌ల కోసం పని చేయాలి. కానీ త‌న‌ మ‌న‌సుకు న‌చ్చి, త‌న‌ను తాను నిరూపించుకునే ఛాలెంజింగ్ పాత్ర‌లు లభించడం లేదని అంటోంది రష్మి.

ఓపెన్‌గా చెప్పేసిన రష్మి

ఓపెన్‌గా చెప్పేసిన రష్మి

ఏదైనా ఓపెన్‌గా మాట్లేడేయటం, కుండ బద్దలు కొట్టేస్తూ చెప్పేయడం రష్మి నైజం. అందుకే తన సినిమా కెరీర్ విషయంలోనూ అంతే ఓపెన్‌గా మాట్లాడుతోంది రష్మి. సినిమాల్లో తనకు ఛాలెంజింగ్ రోల్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా తాను ప్రస్తుతం డ‌బ్బు సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా కెరీర్ కొనసాగిస్తున్నానని అంటూ సంచలనం సృష్టించింది రష్మి.

కేవ‌లం త‌న‌ను గ్లామ‌ర్ డాల్‌గానే చూస్తున్నారు తప్పితే..

కేవ‌లం త‌న‌ను గ్లామ‌ర్ డాల్‌గానే చూస్తున్నారు తప్పితే..

తాను గ్లామ‌ర్ డాల్‌గానే చూస్తున్నారు తప్పితే.. సరైన అవకాశం ఇచ్చే దర్శకులు ఒక్కరూ లేరని అంటోంది రష్మి. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర లభించలేదని, ఒక్క ద‌ర్శ‌కుడు కూడా ఛాలెంజింగ్ రోల్ ఇవ్వ‌లేద‌ని చెబుతోంది. ఎలాగూ మంచి పాత్రలు రావడం లేదు.. ఈ లోగా వచ్చిన పాత్రలు చేస్తూనే బ్యాంక్ బ్యాలెన్స్ అయినా పెంచుకోవాలి కదా! అని ఆసక్తికరంగా మాట్లాడింది రష్మి.

వెబ్ సిరీస్ చేయాలనే ప్లాన్

వెబ్ సిరీస్ చేయాలనే ప్లాన్

వెండితెరపై తాను అనుకున్న పాత్రలు దక్కడం లేదని చెప్పిన రష్మి.. ఓ వెబ్ సిరీస్ చేయాలనే ప్లాన్‌లో ఉందట. అతి త్వరలో ఈ వెబ్ సిరీస్ మొదలు పెట్టనున్నానని అంటోంది రష్మి. ఏదేమైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, సమాజంలో జరుగుతున్న దుశ్చర్యలను ఖండించడంలో ముందుండటం రష్మి లోని బెస్ట్ క్వాలిటీస్ అని చెప్పుకోవచ్చు. అంతేగా మరి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X