Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ముద్దుల్లో మునిగిన రష్మీ గౌతమ్.. బుగ్గలు నాకేస్తూ.. వైరల్ వీడియో.. హోరెత్తుతున్న కామెంట్స్
రష్మీ గౌతమ్.. ఈ పేరు వింటేనే బుల్లితెర, వెండితెర ఆడియన్స్‌లో అదో కిక్కు. ఆమె లోని గ్లామర్ ఓ ఎత్తయితే చూపించే పర్ఫార్మెన్స్ మరో ఎత్తు. ముఖ్యంగా బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా రష్మీకి అంతులేని ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్‌కి రెక్కలు కట్టేలా వెండితెరపై కాలుమోపి పలు సినిమాల్లో నటించిన రష్మీకి ఆశించిన ఫలితం రానప్పటికీ సిల్వర్ స్క్రీన్ ఆడియన్స్‌ని తన అందచందాలతో కైపెక్కించింది. మరోవైపు నెట్టింట కూడా రష్మీ తన హంగామా సాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? వివరాల్లోకి పోతే..
ముద్దుల్లో మునిగిన రష్మీ గౌతమ్
తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ వీడియో షేర్ చేసింది రష్మీ. తన కుక్కపిల్ల పప్పీకి, తనకు మధ్య ఉన్న ప్రేమానురాగం తెలిపేలా అభిమానులకు విందు లాంటి వీడియో అది. ఇందులో రష్మీ గౌతమ్ ని ముద్దుల్లో ముంచెత్తుతూ కనిపించింది ఆ కుక్క పిల్ల.
మూగ జీవులపై ప్రేమ.. బుగ్గలు నాకేసింది
రష్మీ గౌతమ్ కి మూగ జీవాలంటే చాలా ప్రేమ. అందుకే తన ఇంట్లో ఒక కుక్కుపిల్లను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది రష్మీ. అంతేకాదు ఆ కుక్కపిల్లను తన బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అవుతోంది. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో ఆ కుక్కపిల్ల, రష్మీ గౌతమ్ బుగ్గలను నాకేస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
నెటిజన్ల కామెంట్స్.. ఆ కుక్కపిల్లకు భలే అదృష్టం
రష్మీ గౌతమ్ బుగ్గలను నాకే అదృష్టం ఆ కుక్క పిల్లకు దక్కిందని పేర్కొంటూ 'డాగ్ ఈజ్ లక్కీ', 'ఆ పప్పిని నేనైతే ఎంత బాగుండో' అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక వీడియోపై మరి కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. కుక్కపిల్లతో మూతులు నాకించుకోవడమేంటి? అంటూ విరుచుకు పడుతున్నారు.
రష్మీ కెరీర్..
హీరోయిన్గా రష్మీకి ‘గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా కలసి రాలేదు. ఇటీవలే ఆమె నటించిన ‘శివరంజని' సినిమా అయితే అసలు జాడే లేదు. దీంతో ఆమె వెబ్ సిరీస్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పలు వెబ్ సిరీస్ షూటింగుల్లో కూడా పాల్గొంటోందని సమాచారం.