అంత మాట అనేసిన రష్మిక.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు
కన్నడ భామ రష్మిక మందాన్న.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఛలో సినిమాతో హిట్ కొట్టిన రష్మిక.. గీతగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. రీసెంట్‌గా డియర్ కామ్రేడ్‌లో లిల్లీ అంటూ పలకరించింది. అయితే సినిమా పరాజయం పాలైనా.. రష్మికకు మాత్రం మంచి పేరే వచ్చింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది.
తాజాగా ఈ భామ గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొంది. అక్కడ దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఫన్నీ కామెంట్ చేసింది. ఈ పిక్చర్ లో ఒకే ఒక్కటి మిస్సింగ్. అది మంకీ.. నా ప్లస్ వన్ మంకీ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇంతకీ ఆ కోతి ఎవరు? అంటూ నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు.

మహేష్ బాబు సరసన నటిస్తోన్న ఈ భామ.. సూపర్ స్టార్‌ను మంకీ అనే రేంజ్‌కు ఇంకా వెల్లలేదు. భీష్మ సినిమాలో నితిన్‌కు జోడిగా నటిస్తోన్న రష్మిక.. అతన్ని ఉద్దేశించి అలా కామెంట్ చేసిందా? అని అనుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ చూస్తుంటే.. నితిన్, రష్మిక వెనకాల పడుతూ కోతి పనులే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నితిన్‌ను టార్గెట్ చేస్తూ మంకీ అని కామెంట్ చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. సుకుమర్, బన్నీ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాలో రష్మిక హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











