Animal Movie: రష్మిక రణబీర్ ఫస్ట్ నైట్ - ఓవైపు రొమాన్స్, మరోవైపు వైలెన్స్.. ఎలా ఎంజాయ్ చేస్తార్రా సామీ!
Animal Movie: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం యానిమల్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా.. వయోలెన్స్ ఫుల్లుగా ఉండబోతున్నట్లు అర్థం అయిపోయింది. తెలుగులో అర్జున్ రెడ్డి ఆ తర్వాత హిందీలో కబీర్ సింగ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీర్ రెడ్డి వంగానే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే యానిమల్ సినిమా టీజర్ చూస్తేనే డైరెక్టర్ టాలెంట్ అండ్ మేకింగ్ స్టైల్ అర్థం అయిపోతుంది. ఈ టీజర్ చూసిన ప్రతీ ఒక్కరికీ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలు గుర్తొస్తాయి.
అయితే ఆ రెండు చిత్రాల్లో రొమాన్స్, వైలెన్స్ వేర్వురుగా చూపిస్తారు. కానీ ఇప్పుడు రాబోయే యానిమల్ సినిమాలో మాత్రం రొమాన్స్ తో పాటే యాక్షన్ సీన్లను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భార్యాభర్తలు అయిన రష్మిక, రణబీర్ కపూర్ లకు ఫస్ట్ నైట్ జరుగుతుండగానే.. విలన్లు వీరిని అటాక్ చేయబోతున్నట్లు సమాచారం. అలా అని భార్యను బెడ్ పైనే వదిలేసి విలన్లతో హీరో ఫైటింగ్ చేయడు. ఇటు రష్మికతో రొమాన్స్ చేస్తూనే.. అటు విలన్లను గాల్లోకి పంపుతాడట. అయితే ఈ సీన్లు చాలా అధ్భుతంగా వచ్చాయని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాలో ఈ ఒక్క సీన్ చూస్తే చాలు ప్రేక్షకులంతా ఫిదా అయిపోతారని చిత్ర బృందం భావిస్తోందట.

క్రష్మిక చాలా సినిమాల్లో హీరోలతో రొమాన్స్ చేసినప్పటికీ.. ఇలాంటి అద్భుతమైవ సీన్లలో మాత్రం నటించలేదని అంతా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు మాత్రం ఇదెక్కడి మాస్ రా మామా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ వైప్ ఫస్ట్ నైట్ మరోవైపు వైలెన్స్ ఏంట్రా.. ఎలా ఎంజాయ్ చేస్తార్రా సామీ అంటూ నెట్టింట రాసుకొస్తున్నారు. ఏది ఏమైనా టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఓ వైపు ఫస్ట్ నైట్, మరోవైపు విలన్స్ ఎటాక్ ను బ్యాలెన్స్ చేస్తూ సీన్లను బాగా తీశారాని మరికొంద మంది వాదిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో ఉండబోతుందో.
యూనిమల్ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టీ సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ సినిమాను డిసెంబర్ ఒకటో తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించబోతున్నారు. అలాగే బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా కథ చాలా అద్భుతంగా, పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తేనే ఈ విషంయ అర్థం అవుతుంది. అలాగే మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కూడా మెండుగానే ఉండనున్నాయి. ఈ సినిమా కోసం రణబీర్ కపూర్ ను స్పెషల్ గా మేకోవర్ చేశారట. ఈ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో భద్రకాళీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.


Click it and Unblock the Notifications











