మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మీక మందన్న.. నెవర్ బిఫోర్ అనేలా గోల్డెన్ ఆఫర్
కన్నడ బ్యూటీ రష్మీక మందన్న లక్కు మామూలుగా లేదు. వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాడమే కాకుండా పెద్ద సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకుంటోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు భీష్మ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. ఇక బాలీవుడ్ ఫెమాస్ ర్యాపర్ బాద్ షా చేయబోతున్న ఒక గ్లామరస్ సాంగ్ లో కనిపించే అవకాశం అందుకుంది. బాద్ షా సాంగ్స్ కు యూట్యూబ్ లలో వంధల మిలియన్ల వ్యూవ్స్ వస్తుంటాయి.
పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా అతని సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో పెద్ద సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. విజయ్ నెక్స్ట్ సినిమాలో కూడా రష్మీక హీరోయిన్ అనే రూమర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ అని మొన్నటి వరకు కథనాలు చాలానే వచ్చాయి. ఇక ఇప్పుడు రష్మీక పేరు కూడా వినిపిస్తుండడంతో సినిమాలో ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక రష్మీక బాలీవుడ్ సైడ్ నుంచి కూడా పలు ఆఫర్స్ అయితే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











