మహేష్ బాబుపై రష్మిక మందన్న అనుమానం! ఆ నోటా ఈ నోటా పడి చివరకు..

భరత్ అనే నేను, మహర్షి లాంటి సినిమాలతో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సెట్స్‌పై మహేష్ బాబును చూసిన రష్మిక తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో సన్నిహితుల వద్ద వాపోయిందట. వివరాల్లోకి పోతే..

 మహేష్, రష్మిక జోడీ.. కీలక సన్నివేశాల చిత్రీకరణ

మహేష్, రష్మిక జోడీ.. కీలక సన్నివేశాల చిత్రీకరణ

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్, రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఎంతో శ్రద్దగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సీన్స్ షూట్ చేస్తున్నారు. తాజాగా ఆ సినిమా షూటింగ్ సంగతులు, అదేవిధంగా యూనిట్ సభ్యులతో మహేష్ బాబు మెదిలే తీరు గురించి రష్మిక మందన్న తన సన్నిహితులకు చెబుతోందట.

పండుగ వాతావరణం.. రష్మిక సంబరం

పండుగ వాతావరణం.. రష్మిక సంబరం

'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు కూడా ఓ ఇంట్లో పండుగ మాదిరి వాతావరణం ఉంటుందని, సెట్ లోని ప్రతి ఒక్కరూ తనతో ఎంతో సరదాగా కలుపుగోలుగా ఉంటారని రష్మిక అంటోందట. వారంతా తనతో మెదిలే తీరు తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని చెబుతూ తెగ సంబర పెడుతోందట ఈ కన్నడ బ్యూటీ.

మహేష్‌ని చూస్తూనే.. ఈయన సూపర్ స్టారేనా?

మహేష్‌ని చూస్తూనే.. ఈయన సూపర్ స్టారేనా?

ఇక మరీ ముఖ్యంగా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుని చూస్తుంటే, ఈయన నిజంగా సూపర్ స్టారేనా అని తనకు అనుమానం వస్తోందని ఆమె వాపోతోందట. సెట్లో మహేష్.. లైట్ బాయ్ దగ్గరి నుండి డైరెక్టర్ వరకు అందరితో మహేష్ బాబు ఎంతో కలుపుగోలుగా ఉంటారని, అందరితో తన ఫ్యామిలీ మాదిరిగా మాట్లాడడం చూసి తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని రష్మిక అంటోందట. అంత పెద్ద స్టార్ అయినా కూడా ఆయనలో ఎలాంటి గర్వం ఉండదని ఆమె చెబుతోందట.

మహేష్ అభిమానులు ఖుషీ

మహేష్ అభిమానులు ఖుషీ

ఏదైనా సీన్‌ని దర్శకుడి కోసం ఎన్నిసార్లు అయినా రీటేక్ చేయడానికి మహేష్ బాబు సంసిద్ధంగా ఉంటారని, అలానే సెట్లో ఆయన ఇచ్చే జోష్ అందరికీ మంచి టానిక్‌లా పని చేస్తుందని రష్మిక అంటోందట. ఆ నోటా ఈ నోటా పడి రష్మిక మాటలు బయటకు రావడంతో మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మహేష్ బాబు భాగం.. హ్యాట్రిక్ కోసం తపన

మహేష్ బాబు భాగం.. హ్యాట్రిక్ కోసం తపన

ఇక ఈ సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్‌ ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలని కసిగా పని చేస్తున్నారు మహేష్ బాబు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు నిర్మాణంలో మహేష్ కూడా భాగం కావడం విశేషం.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
విజయశాంతి రీ ఎంట్రీ.. దేవి శ్రీ బాణీలు

విజయశాంతి రీ ఎంట్రీ.. దేవి శ్రీ బాణీలు

ఇక ఈ సినిమాతోనే లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. దేవి శ్రీ బాణీలు కడుతున్న ఈ సినిమా జనవరి 12న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X