తమిళంలోకి రష్మిక ఎంట్రీ.. సూపర్ హీరోతో కలిసి..
కన్నడ, తెలుగు రంగాల్లో జోష్‌ను కొనసాగిస్తున్న రష్మిక మందన ఇక తమిళ రంగంలోకి అడుగుపెట్టనున్నది. 'ఖాకీ' లాంటి విభిన్నమైన సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందబోయే మరో సినిమాలో రష్మిక నటించనున్నది. కార్తీ 19వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా కనిపించనున్నది.
ప్రస్తుతం తమిళ సూపర్‌స్టార్ సూర్యతో NGK చిత్రాన్ని నిర్మిస్తున్న ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'రెమో' ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.

రష్మిక మందన కెరీర్ విషయానికి వస్తే, కన్నడలో కిరిక్ పార్టీ చిత్రంతో భారీ సక్సెస్‌ను అందుకొన్నది. ఆ తర్వాత తెలుగు రంగంలోకి ప్రవేశించి చలో, గీతా గోవిందం, దేవదాస్ లాంటి విజయాలను తన ఖాతాలో వేసుకొన్నది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రెడ్ చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











