అతనికి లవ్ యూ అని చెప్పేసిన రష్మిక మందన్న.. వీడియో వైరల్

మరోసారి హీరోయిన్ రష్మిక మందన్నతో ఓ ప్రయోగం చేస్తున్నాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'ఛలో' అంటూ పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే రష్మికకు టాలీవుడ్‌లో మొదటి సినిమా. ఆ తర్వాత క్రేజీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ భామ మళ్ళీ ఇప్పుడు అదే వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమా చేస్తోంది.

ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ ప్రస్తుతం ఇటలీలోని పాసిటానో ప్రాతంలో షూట్స్ చేస్తోంది. పాసిటానో ప్రాతంలోని అందమైన లొకేషన్స్‌లో నితిన్, రష్మికలపై పలు సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

అయితే తాజాగా ఈ ప్రాంతంలో నితిన్, రష్మికలు 'వార్' సినిమాలోని హృతిక్ రోషన్ సాంగ్ 'గుంగురో' కి డాన్స్ చేసి వావ్ అనిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మిక.. ''లవ్ యు హ్రితిక్'' అంటూ పోస్ట్ చేయడం విశేషం. ఇద్దరూ సూపర్‌గా డాన్స్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Rashmika Mandanna Express her love With video

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై 'భీష్మ' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్‌ మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సింగిల్ ఫ‌ర్ ఎవ‌ర్‌ అనే ట్యాగ్‌లైన్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటు రష్మిక అభిమానులకు, అటు నితిన్ అభిమానులకు రొమాంటిక్ ట్రీట్ ఇవ్వనుందని అంటున్నారు. చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X