ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో కన్నడ బ్యూటీ: ఆమెనే ఫైనల్ చేసిన చిత్ర యూనిట్

'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్‌ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ప్రకటించినప్పటికీ చాలా రోజుల వరకూ దానికి సంబంధించిన అప్‌డేట్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. అయితే, ఇటీవల నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ట్విట్టర్‌లో ఓ ఫొటోను షేర్ చేస్తూ.. తారక్ గారి ముప్పైవ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుంది అని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ న్యూస్ లీక్ అయింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నానే ఫైనల్ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి ఈ సినిమాలో ఆమె నటించబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ.. మధ్యలో ఆమె ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో మరికొందరు నటీమణుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఆమెను తీసుకున్నారన్న వార్త బయటకు వచ్చింది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Rashmika Mandanna Fix for Jr NTR - Trivikram Movie

ఇక, ఈ మూవీ జనవరి 14న అధికారికంగా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ షూటింగ్ మాత్రం RRR పూర్తయిన తర్వాతనే ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో తారక్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కనిపించనున్నాడని అంటున్నారు. అలాగే, ఈ సినిమా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నట్లు, సునీల్ విలన్‌గా నటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X