Rashmika Mandanna: ‘పుష్ప 3’లో విలన్ గా రౌడీ హీరో.. రష్మిక ఏమన్నారంటే?
Rashmika Mandanna : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పుష్పరాజ్ ఫీవర్ కనిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. భారీ మొత్తంలో వసూల్లు చేస్తూ.. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. గతంలోని పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను రాస్తుంది పుష్ప 2. ఊహించని విధంగా విజయాన్ని అందుకోవడంతో పుష్ప 3 కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. పైగా ఆ న్యూస్ పై హీరోయిన్ రష్మిక మందార ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ వార్త ఏంటి? రష్మిక ఏమన్నారంటే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసి గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.

ఇక ఫ్యాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీసును షేక్ చేసింది. విడుదలైన కేవలం ఆరు రోజులలోనే రూ. 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం 1500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. ఇలా ఎన్నో పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసి పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
వాస్తవానికి పుష్ప 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప 2 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. పుష్ప 2 కూడా భారీ బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడంతో పుష్ప 3 కూడా రాబోతుందని మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసింది. అంతేకాదు పుష్ప 2 సినిమాలో క్లైమాక్స్ లో పుష్ప 3 కి సంబంధించిన లీక్స్ ఇవ్వడంతో సీక్వెల్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పుష్ప 3 కి సంబంధించిన టైటిల్, పోస్టర్లు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి. పుష్ప 3 ది రాంపేజ్ అని పేర్కొన్నారు.

పుష్ప 3 ది రాంపేజ్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ విలన్ గా నటించబోతున్నారని ప్రచారం సోషల్ మీడియాలో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున పోస్టర్లు మీమ్స్, రీల్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి.ఇండస్ట్రీలో ఇందుకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పుష్ప 3 సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్ పై హీరోయిన్ రష్మిక మందాన ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
హీరోయిన్ రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్ప3లో విలన్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్నారా? అని ప్రశ్నించగా.. అందుకు ఓ ఇంట్రెస్టింగ్ సమాధానాన్ని ఇచ్చింది. పుష్ప 3 కి సంబంధించిన విషయాలు తనకేమీ తెలియదని, డైరెక్టర్ సుకుమార్ సినిమా విషయంలో చాలా పక్కా ప్లాన్ తో ఉంటారని చెప్పింది. అలాగే ప్రతి విషయంలో డైరెక్టర్ సస్పెన్స్ ఉండేలా చూసుకుంటారని, చివరి వరకు ఈ విషయాన్ని కూడా వేరే వాళ్లకి వెల్లడించాలని చెప్పుకొచ్చింది. పుష్ప 2 సినిమాలో క్లైమాక్స్ లో కనిపించిన వ్యక్తిని చూసి ఇతని ఎవరు? అని తాను కూడా షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది రష్మిక మందాన. అయితే ఈ ప్రచారంలో ఇంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications











