Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యంగ్ డైరెక్టర్ కోసం రష్మిక కీలక నిర్ణయం.. మళ్లీ అతడితో కలిసేందుకు రెడీ
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు. సాదాసీదాగానే హీరోయిన్‌గా పరిచయమైన ఈ అమ్మడు.. అదిరిపోయే అందం, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, గత ఏడాది 'సీతా రామం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.
బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!
రష్మిక మందన్నా ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న 'యానిమల్' మూవీతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప ద రూల్'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిన్నది మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యూత్ స్టార్ నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరో సినిమా చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలోనే రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేయబోతుందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

వాస్తవానికి రష్మిక మందన్నాను డైరెక్టర్ వెంకీ కుడుమలనే 'ఛలో' అనే చిత్రంతో తెలుగులోకి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత నితిన్ హీరోగా అతడు తెరకెక్కించిన 'భీష్మ'లోనూ నటించింది. ఈ రెండు సినిమాలూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ డైరెక్టర్ కోసం రష్మిక మందన్నా సినిమా చేయబోతుందట. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తనను పరిచయం చేసిన డైరెక్టర్ కోరడంతో ఆమె ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!
'భీష్మ' వంటి సక్సెస్ తర్వాత నితిన్ - వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మూవీ రాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఓ వ్యాధి కారణంగా నెల రోజుల్లో చనిపోయే వ్యక్తి జీవితంలో జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనతో ఈ మూవీ తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది.