Rashmika Mandanna : రష్మికకి వింత ఫోబియా .. అయినా బన్నీతో ఆ సీన్లలో ..
ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ నుంచి వెళ్లి పాన్ ఇండియా లెవెల్లో రూల్ చేస్తున్న హీరోలు ఎవరు అంటే మొదటగా డార్లింగ్ హీరో ప్రభాస్ , ఇపుడు ఐకాన్ స్టార్ పుష్ప రాజ్ అల్లు అర్జున్ పేర్లే వినిపిస్తాయి. మరి హీరోస్‌లో వీరైతే ... హీరోయిన్స్‌లో మాత్రం ఒకే ఒక్క హీరోయిన్ ఉందని చెప్పాలి.ఆ హీరోయిన్ నే నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
కెరీర్ స్టార్ట్ చేసిన కొద్దిరోజులకే పాన్ ఇండియా హీరోయిన్ అయ్యిపోయి ఇపుడు మోస్ట్ హ్యాపెనింగ్ పాన్ ఇండియా హీరోయిన్ గా నిలిచింది రష్మిక. రీసెంట్‌గా ఈమె నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ చిత్రం పుష్ప 2తో మళ్ళీ పాన్ ఇండియా ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసి అదరగొట్టింది. పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2కి ఓ రేంజ్‌లో తన గ్లామర్ డోస్‌ని పెంచేసి హాట్ షో చేసిన రష్మిక మందన్నా ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది.

కాగా ఈ సినిమా సక్సెస్‌లోనే పలు నేషనల్ మీడియాల వారికి తాను ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన గురించి ఓ షాకింగ్ ఫ్యాక్ట్‌ని రివీల్ చేసింది. ఆమెకి ఓ వింత ఫోబియా ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. జనరల్‌గా చాలా మందికి కొన్ని రకాల ఫోబియాలు ఉంటాయి. కొందరికి ఎత్తు ప్రదేశాలు అన్నా, కొన్ని జంతువులూ లేదా ప్రాణులు అంటే భయాలు ఉంటాయి.
ఇలానే నేషనల్ క్రష్‌కి కూడా ఒక భయం ఉందట. ఇది వింటే మాత్రం డెఫినెట్ గా దీనికి కూడా భయపడతారా అనుకుంటారు. మరి రష్మిక అంతలా భయపడే అంశం ఏదో కాదట. తనని ఎవరైనా ఎత్తుకుంటే ఆమెకి ఎంతో భయమేస్తుందట. ఈ నేపథ్యంలోనే పుష్ప 2లో పీలింగ్స్ సాంగ్ చేసేటపుడు భయపడినట్టుగా ఆమె చెబుతోంది.

ఈ హాట్ సాంగ్‌లో చాలా మూమెంట్స్ లో అల్లు అర్జున్ నడుము వరకు ఎత్తుకొని ఇంకో మూమెంట్ అయితే ఏకంగా తన భుజాలపైకి ఎక్కి మాస్ స్టెప్పులు చేస్తుంది. కాగా తనకి ఇలాంటివే భయం అని చెప్పుకొచ్చింది రష్మిక. దీనితో ఇది విన్న నెటిజన్స్ ఏంటి ఇలాంటి వాటికి కూడా భయపడతారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇలా మొత్తానికి రష్మిక వింత ఫోబియా ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రస్తుతానికి పుష్ప 2 సినిమాని కంప్లీట్ చేసిన రష్మిక తెలుగులో కుబేర సహా హిందీలో సికందర్ అనే పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇదే ఇంటర్వ్యూలో పుష్ప 2కి సీక్వెల్‌గా పుష్ప పార్ట్ 3 కూడా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అందులో తన రోల్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











