ఇంట్లో ఎవరూ లేరన్న రష్మిక.. దూసుకెళ్తున్న ప్రభాస్, రచ్చ మామూలుగా లేదుగా!

సోషల్ మీడియా పరిధి విస్తృతం అయింది. యువతలో ఎక్కువ భాగం వన్ సోషల్ మీడియాలో గడుపుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే హీరో హీరోయిన్లు సైతం ఎక్కువగా సోషల్ మీడియాలో తమ అభిమానులతో టచ్ లో ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అలా తమను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన వారికి రిప్లై ఇస్తూ వారిని ఆనంద పరుస్తూ ఉంటారు..అలా తనను ట్యాగ్ చేసిన ఒక వీడియోకి రష్మిక ఆసక్తికరంగా కామెంట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

రష్మిక ఎంట్రీ

రష్మిక ఎంట్రీ

'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. గీత గోవిందం సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రేడ్' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు.

సూపర్ క్రేజ్

సూపర్ క్రేజ్

ఆ తర్వాత ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో నటించి రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత నితిన్‌తో భీష్మతో హిట్ అందుకుని మంచి ఫాంలో ఉన్న ఈ భామ ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా కాక ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలకు ఓకే చెప్పింది.

 బాలీవుడ్ లో కూడా

బాలీవుడ్ లో కూడా

ఇక్కడ బిజీగా ఉన్న సమయంలో రష్మికకి రెండు బాలీవుడ్ సినిమాల్లో అవకాశం దక్కింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ భామ రెండు సినిమాల్లో నటిస్తోంది. రష్మిక 'మిషన్ మంజు' సినిమాతో బాలీవుడ్ కి దర్శకుడు శాంతన భాగ్చీ పరిచయం చేస్తున్నారు. ఇక స్పై థ్రిల్లర్ 'మిషన్ మంజు'లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా ఆ సినిమాలో రష్మిక హీరోయిన్. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆమె అమితాబ్ తో 'గుడ్ బై' సినిమా కూడా కమిట్ అయింది.

అమ్మా, అయ్యా ఇంట్లో ఎవరూ లేరు

అమ్మా, అయ్యా ఇంట్లో ఎవరూ లేరు

ఆ సంగతి పక్కన పెడితే ఈ భామ నితిన్ తో కలిసి భీష్మ సినిమాలో నటించగా ఆ సినిమా ట్వింకిల్ ట్వింకిల్ అంటూ సాగే ఒక సాంగ్ వైరల్ అయింది. ఈ సాంగ్ అందరికీ తెగ నచ్చేసింది. అయితే ఈ సాంగ్ లో అమ్మా, అయ్యా ఇంట్లో ఎవరూ లేరు అంటూ ఒక చిన్న లిరిక్ ఉంటుంది. సాంగ్ ప్రకారం చూస్తే బాగానే ఉన్నా ఈ లైన్ తోనే రష్మిక అభిమాని ఒక తింగరి ప్రయత్నం చేశాడు.

ఆడేసుకుంటున్నారుగా

ఆడేసుకుంటున్నారుగా

రష్మిక అలా అంటూ ఉంటే ప్రభాస్ వెంటనే బైక్ తీసుకుని వెళ్ళి పోతున్నట్టుగా ఉన్న సాహో సినిమా లోని వీడియో ఒకదానిని యాడ్ చేశారు. అయితే ఇది కేవలం ట్రోల్ చేయడానికి నవ్వుకోవడానికి చేస్తే ఆమెకు ఏం అర్థం అయిందో తెలియదు కానీ దానిని షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీ పెట్టి లవ్ సింబల్ కూడా పెట్టింది.. దీంతో కొందరు నెటిజన్లు ఈమెకు ఏం అర్థం అయిందో ? ఎన్నో వీడియోలు షేర్ చేస్తే ఇలాంటి వీడియోకి రిప్లై ఇచ్చింది అంటూ ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ వీడియో ని షేర్ చేస్తూ రష్మికను ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X