పూజా హెగ్డేకు రష్మిక మందన్న సమస్య..? ఇదీ అసలు మ్యాటర్..

ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. సినిమాల పరంగా టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై వరుస హిట్స్ పట్టేస్తున్న ఈ భామ మంచి జోష్‌లో ఉంది. వరుస పెట్టి టాప్ హీరోల సరసన అవకాశాలు రావడం ఈ అమ్మడికి బాగా ప్లస్ అయింది. ఇక రానున్న రోజుల్లో పూజా హెగ్డే సినిమాల వరద పారుతుందని అనుకున్నారంతా. అయితే ఈ లోగా రష్మిక మందన్న రూపంలో ఈమెకు సమస్య వస్తోందని సోషల్ మీడియాలో కథనాలు స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ ఆ కథనాల్లో మ్యాటర్ ఏంటి? చూద్దామా..

పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇద్దరూ కూడా కన్నడ భామలే. ఇద్దరికీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ బాగా కలిసొచ్చింది. ఇద్దరికీ వరుస అవకాశాలు, పైగా టాప్ హీరోలతో నటించే ఛాన్స్.. ఇవన్నీ సిమిలారిటీస్. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు భామల నడుమ గట్టి పోటీ నెలకొందనేది కొందరు చెబుతున్న మాట. ఇక నుంచి రష్మిక మందన్న గ్లామర్ రోల్స్ కూడా చేస్తానని చెబుతోంది కాబట్టి దర్శకనిర్మాతల చూపు ఆమె పైనే పడుతోందని, ఆ ఎఫెక్ట్ డైరెక్ట్‌గా పూజా హెగ్డే పైనే పడుతోందని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్‌లో పూజా హెగ్డే సినిమా అవకాశాలను రష్మిక మందన్న తన్నుకుపోతుందని విశ్లేషిస్తున్నారు. అయితే ఎవ్వరు, ఎన్ని చెప్పినా ప్రతీ వ్యక్తిలో ఓ స్పెషల్ టాలెంట్ ఉంటుందని.. అదే వారిని ముందుకు తీసుకెళ్తుందని.. కాబట్టి ఎంత పోటీ నెలకొన్నా రష్మిక, పూజా హెగ్డే ఇద్దరు కూడా అవకాశాలు అందుకోవడంలో ముందుంటారని అంటున్నారు ప్రేక్షకులు.

 Rashmika Mandanna is a Problem for Pooja Hegde..?

ఇక పూజా హెగ్డే, రష్మిక సినిమాలంటారా.. ఇటీవలే మహేష్ బాబుతో మహర్షి చేసిన పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా, అల్లు అర్జున్ సరసన మరో సినిమాలో నటిస్తోంది. మరోవైపు రష్మిక మందన్న మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో ఓ సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X