Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
రష్మికకు చేదు అనుభవం.. ముద్దు పెట్టి పరారైన ఆకతాయి.. షాక్‌లో హీరోయిన్
ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా చెలామణి అవుతోంది రష్మిక మందాన్న. ఈ కన్నడ సుందరి చేతి నిండా ప్రాజెక్ట్‌లతో యమా బిజీగా గడిపేస్తుంది. ప్రత్యేకించి తెలుగు నాట స్టార్ హీరోయిన్ స్టేటస్ కూడా వచ్చేసింది. సూపర్ స్టార్‌తో నటించేసింది.. స్టైలీష్ స్టార్‌తో నటించేందుకు సిద్దమవుతోంది. యంగ్ స్టార్ నితిన్‌తో చేసిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇలా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది.
హీరోయిన్లు కనబడితే ఆగని అభిమానులు..
వెండితెరపై హీరోయిన్లు కనబడితేనే ఆగని అభిమానులు.. ఎదురుగా చూస్తే ఆగుతారా. అయినా అభిమానులందరూ ఒకేలా ఉండరు. కొందరు ఆకతాయిలు కూడా ఉంటారు. అలాంటి వారు చేసే పనికి ఒక్కోసారి షాక్ తగులుతుంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళ్లినప్పుడు, జనాల్లోకి లేదా ఏదైనా ఈవెంట్లకి వెళ్లినప్పుడు హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.
బిజీగా ఉన్న రష్మిక..
ప్రస్తుతం రష్మిక మందాన్న ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన భీష్మ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ అంటూ తిరుగుతూనే ఉంది. ఆ క్రమంలోనే ఓ ఈవెంట్‌కు వెళ్లిన రష్మకకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో పక్కనున్న వారంతా అవాక్కయ్యారు.
ముద్దుపెట్టి పరారైన ఆకతాయి
ఓ ఈవెంట్‌కి వెళ్లి వస్తోన్న సందర్భంలో.. ఓ ఆకతాయి సెల్ఫీ నెపంతో దగ్గరకు వచ్చి.. రష్మికను లాగి.. ముద్దు పెట్టేశాడు. అతను చేసిన పనికి అటు రష్మికతో పాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. ముద్దు పెట్టుకున్న ఆకతాయి పారిపోయాడు.
Recommended Video
ఫిర్యాదుతో వీడియో డిలీట్..
ఆ అగంతకుడు రష్మిక మందన్నను ముద్దు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అది క్షణాల్లో వైరల్ అయింది. ఆ తర్వాత రష్మిక మందన్న ప్రోగ్రామ్‌ను ఆర్గనైజ్ చేసిన వాళ్లు ఈ విషయమై లోకల్ పోలీసులకు కంప్లైట్ ఇవ్వడంతో సదరు వీడియోను నుంచి డిలీట్ చేయించారు. అయితే టిక్‌టాక్‌లోనూ ఇది పాకడంతో అక్కడ మాత్రం చక్కర్లు కొడుతూనే ఉంది.