ముద్దుల మాయలో రష్మిక మందన్న.. రెచ్చిపోతూ ముద్దులు.. వైరల్ పిక్
తెలుగు సినీ ఇండస్ట్రీలో అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. ఛలో అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఈ కన్నడ భామ 'గీత గోవిందం' సినిమాతో తన ముద్దులకు ఓ ప్రత్యేకత ఉందని ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో ముద్దు సీన్ ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తోంది రష్మిక.

రష్మిక మందన్న.. అక్కడ కూడా యమ యాక్టివ్
సెట్స్‌పై అదేవిధంగా సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో సోషల్ మీడియాలో అంతకు రెట్టింపు జోష్‌లో ఉంటుంది రష్మిక మందన్న. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్, గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కిక్కివ్వడం అమ్మడి నైజం.

ముద్దుల మాయలో కన్నడ బ్యూటీ
ఈ నేపథ్యంలోనే తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్‌స్టాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేసి అందరిలో తాను స్పెషల్ అనిపించుకుంది రష్మిక. ఈ పిక్‌లో రష్మిక ఒక్కతే కనిపిస్తోంది కానీ ఆమె ముద్దుల మాయలో మునిగితేలుతుండటం విశేషం.

రష్మికను ఆటపట్టించేలా కామెంట్లు
ఈ పిక్ చూసిన ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మేడమ్ ఈ ముద్దు అతనికేనా? అంటూ ఆమెను ఆటపట్టించేలా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పిక్‌పై లైకులైతే లక్షల్లో వచ్చిపడుతున్నాయి. దీంతో రష్మిక ముద్దులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కన్నడ చిత్ర సీమతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో
'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రంతో 2016లో చిత్రపరిశ్రమకు పరిచయమైంది రష్మిక మందన్న. కన్నడ చిత్ర సీమతో పాటు తెలుగు సినీ పరిశ్రమలోనూ తనదైన మార్క్ వేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

ఓ స్పెషల్ మార్క్.. అందులోనూ తక్కువ కాదు
విజయ్ దేవరకొండకు జోడీగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు చేసి ఆకట్టుకుంది రష్మిక. రొమాంటిక్ సీన్స్‌లో తనకంటూ ఓ స్పెషల్ మార్క్ ఉందని నిరూపించి సూపర్బ్ అనిపించుకుంది ఈ బ్యూటీ. ఎమోషనల్ సీన్స్‌లోనూ తాను తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంది.

మహేష్ బాబుతో రష్మిక రొమాన్స్
ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోంది రష్మిక మందన్న. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశముంది.
Recommended Video

నితిన్ సరసన భీష్మ'లో
ఈ సినిమాతో పాటు నితిన్ సరసన 'భీష్మ'లో హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక. ఈమె జోష్ చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమలో ఆమె క్రేజ్ ఇంకా పెరిగే అవకాశముందని స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి మున్ముందు రష్మిక జోష్ ఎలా ఉంటుందనేది.


Click it and Unblock the Notifications










