Trending: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫోటో వైరల్.. మ్యారేజ్‌కు ఎవరెవరు వచ్చారంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయోజనాల కంటే దుర్వినియోగమే ఎక్కువగా కనిపిస్తున్నది. డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా సినీ తారల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. ఫోటోలు, వీడియోలను క్రియేట్ చేసి అసహజ సంబంధాలను అంటగడుతున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా టాప్ స్టార్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న పెళ్లి జరిగినట్టు.. ఆ పెళ్లికి సినీ తారలంతా కలిసి వచ్చినట్టు ఓ ఫోటోను క్రియేట్ చేసి సోషల్ మీడియలో వదిలారు. దాంతో ఆ విషయం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే?

సోషల్ మీడియాలో కొద్ది రోజుల క్రితం ధనుష్, మృణాళ్ థాకూర్ పెళ్లి వీడియో హల్‌చల్ చేసింది. చెన్నైలో రహస్యంగా ఈ ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకొన్నారు. ఆ పెళ్లికి శృతిహాసన్ లాంటి సినీ తారలందరూ హాజరయ్యారు. ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహం ఇటీవల సీక్రెట్‌గా మీడియాకు దూరంగా నిర్వహించారు అని ఆ వీడియోను ట్రెండ్ చేశారు. ఈ వీడియో జాతీయ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు.
ఇలాంటి వీడియో వ్యవహారం సద్దుమణగకముందే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫోటో వైరల్ అయింది. ఆ ఇద్దరి వివాహం గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. ఆ వివాహానికి టాప్ సినీ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. వారిలో మహేష్ బాబు, సమంత, సందీప్ రెడ్డి వంగా, కరణ్ జోహర్, అల్లు అర్జున్, త్రిషా, మృణాల్ థాకూర్, రాంచరణ్ తదితరులు వచ్చినట్టు ఫోటోను క్రియేట్ చేశారు. పెళ్లి మండపంలో విజయ్, రష్మిక పూజ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో ట్రెండింగ్ అవుతున్నది.
ఇదిలా ఉండగా, రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నదనే విషయం కొద్లి నెలలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ వారిద్దరూ తమ రిలేషన్‌షిప్ గురించి ధృవీకరించలేదు. అయితే ఈ మధ్య వారిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది అనే వార్త బయటకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ పెళ్లి గురించి రష్మిక నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. దాంతో వారిద్దరి పెళ్లి త్వరలో కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్‌పూర్‌లో వారి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్త మీడియాలో నానుతున్నది.
ఇదిలా ఉండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు టీ సిరీస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ చిత్రంలో విజయ్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, మోషన్ వీడియోను ఇటీవల రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ద్వారా వారిద్దరూ కలిసి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











