twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న రష్మిక.. ఇకపై అక్కడ కూడా ఆమెదే హవా!

    |

    గత కొంతకాలంగా తెలుగు తెరపై సందడి చేస్తూ సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్న.. ఇక తమిళ చిత్రసీమలోనూ పాగా వేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో కార్తీ సరసన ఓ సినిమాలో నటిస్తున్న ఆమె, ఇప్పుడు సూర్యతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిందట.

    యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య తన కొత్త చిత్రం చేయ‌బోతున్నారు. ఈ సినిమా కోసం సూర్య‌కు జోడీగా మాళ‌వికా మోహ‌న‌న్‌ని అనుకున్నారు కానీ.. ఆమె విజ‌య్ హీరోగా రూపొందుతున్న మాస్ట‌ర్‌ చిత్రంలో బిజీగా వుండ‌టం వ‌ల్ల డేట్స్ ఇవ్వలేదట. దీంతో ఆమె స్థానంలో ర‌ష్మికని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌ దర్శకనిర్మాతలు. ర‌ష్మిక కూడా సూర్య‌తో క‌లిసి న‌టించడానికి ఓకే చెప్పిందని లేటెస్ట్ టాక్. దీంతో ఒకేసారి అన్నా త‌మ్ముళ్ల‌తో రష్మిక రొమాన్స్ చేస్తోందని చెప్పుకుంటున్నారు అక్కడి ప్రేక్షకులు.

    Rashmika Mandanna New movie confirmed with Star Hero

    ఛలో ఆంటీకి టాలీవుడ్ గడప తొక్కిన ఈ క‌న్న‌డసోయ‌గం.. ఇటీవలే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ సాధించింది. తెలుగులో క్రేజీ ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతున్న ఈ భామ మరికొద్ది రోజుల్లోనే 'భీష్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    అలాగే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న మాస్ మాసాలా ఎంట‌ర్‌టైనర్ లోనూ రష్మిక నటిస్తోంది. మైత్రి మూవీమేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. తెలుగులో టాప్ స్టార్స్‌ని చుట్టేస్తున్న ర‌ష్మిక ఇక త‌మిళంలోనూ అదే పని మొదలు పెట్టేసిందన్నమాట.

    English summary
    Rashmika Mandanna doing her next project with tamil hero Suriya. This movie ready to go for sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X