రష్మిక ఎమోషనల్ పోస్ట్ .. హృదయం ముక్కలైంది అంటూ, ఏం జరిగింది?
చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం అనేది ఒక హీరోకి లేదా హీరోయిన్‌కి చాలా కష్టం అనే చెప్పాలి. అయితే హీరోస్‌లో మాత్రం భారీ పోటీ తప్పదు. కానీ కొందరు హీరోయిన్స్ కి మాత్రం కరెక్ట్ సినిమాలు పడితే ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీలో ఓ రేంజ్ కి వెళ్ళిపోతారు అనడానికి ఎన్నో ఉదాహరణలు .
ప్రస్తుతం మన దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొందరు యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ కనిపిస్తారు. వీరిలో టాప్ బ్యూటీ .. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఒకరు. కాగా రష్మిక మందన్నా హీరోయిన్ గా ఇపుడు ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ దున్నేస్తున్నారు. ఇలా సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో అత్యంత వేగంగా సెటిల్ అయ్యిన టాప్ హీరోయిన్ గా నిలిచింది.

రష్మిక కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా బ్లాక్ బ్లస్టర్ "పుష్ప" అని చెప్పాలి. ఈ సినిమా విజయంతోనే రష్మిక భారీ స్టార్‌డమ్‌తో పాటుగా నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా తెచ్చుకుంది. ఇక ఈ బిగ్గెస్ట్ సినిమాకి సీక్వెల్‌గా పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుని, డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్, డబ్బింగ్ ఇతర కార్యక్రమాలను పూర్తి అయ్యిన తరుణంలో రష్మిక బాగా ఎమోషనల్ అయ్యారు.
ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. తన ఏడేళ్ల కెరీర్ లో ఒక్క పుష్ప సినిమా జర్నీనే మొత్తం ఐదేళ్లు ఉందని పేర్కొంది. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమని.. ఒక రకంగా పుష్ప జర్నీ అనేది తనకు ఒక ఇల్లులా మారిపోయింది అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో తనతో పాటు పని చేసిన ప్రతీ ఒక్కరినీ ఎంతో మిస్ అవుతానని రష్మిక తెలిపింది. నా హృదయం ముక్కలైందంటూ ఓ నోట్ పెట్టింది.

ఈ ఐదేళ్లలో చాలా వర్క్ చేసామని.. ఇంకా కొంచెం బ్యాలన్స్ ఉంది అంటూ పనిలో పనిగా పుష్ప పార్ట్ 3 పై కూడా ఆమె హింట్ ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ సర్, సుకుమార్ సర్ ఇంకా ఈ సినిమా సమయంలో తనకు బాగా క్లోజ్ అయ్యారని రష్మిక తెలిపింది. 5 ఏళ్ల పుష్ప ప్రయాణం ఒక ఇల్లులా మారిందని.. ఇపుడు దానిని విడిచి వెళ్ళాలి అంటే కొంచెం ఎక్కువ బాధగానే ఉందని నేషనల్ క్రష్ ఎమోషనల్ అయ్యింది. దీనితో రష్మిక మందన్న ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











