మెగాస్టార్‌తో షేర్ చేసుకోనున్న రష్మిక మందన్న.. ఈ లోగానే ఇటలీలో!
మరో వారంరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా న్యూ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు తమ తమ కొత్త సంవత్సర వేడుకలను ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలో ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక మందున్నకు సంబంధించిన న్యూ ఇయర్ అప్‌డేట్ తెలిసింది.
ఇటీవలే సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ఫినిష్ చేసిన రష్మిక మందున్న ప్రస్తుతం నితిన్ సరసన 'భీష్మ' చిత్రంలో నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' డబ్బింగ్ పూర్తిచేసుకొని.. తన తాజా చిత్రం 'భీష్మ' కోసం ఇటలీ వెళ్లిపోయింది రష్మిక మందన్న. ఈ నేపథ్యంలో ఇటలీలోనే రష్మిక మందన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోనుందట. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటోందట ఈ కన్నడ భామ.

నితిన్ హీరోగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోంది భీష్మ మూవీ. శరవేగంగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా యూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం ఇటీవలే ఇటలీ వెళ్లింది. అక్కడ రష్మిక, నితిన్‌లపై పాటల చిత్రీకరణ జరగనుంది. సో జనవరి 1 వరకు అక్కడే ఉండాలి కాబట్టి.. రష్మిక న్యూ ఇయర్‌ని బీష్మ యూనిట్ తో కలిసి అక్కడే సెలబ్రేట్ చేసుకోనుందట.
ఇక రష్మిక తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు రెడీ అయింది. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్‌తో వేదిక పంచుకోనుంది రష్మిక. ఫిబ్రవరి 21న రష్మిక మందన్న- నితిన్ కాంబోలో వస్తున్న భీష్మ రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











