Kingdom: కింగ్డమ్ మూవీపై రష్మిక మందన్న రివ్యూ.. విజయ్ దేవరకొండ రిప్లై ఇదే!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న - రౌడీ స్టార్ విజయ్ దేవరకొండలు రిలేషన్‌లో ఉన్నారని గత కొద్దినెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పబ్లిక్‌గా చక్కర్లు కొడుతూ మీడియా కంటపడుతున్నా తమ మధ్య బంధాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. తాజాగా కింగ్డమ్ మూవీ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి రష్మిక మందన్న పోస్ట్ పెట్టడంతో మరోసారి వీరిద్దరి రిలేషన్ వార్తల్లోకి ఎక్కింది.
గీత గోవిందం సినిమాలో తొలిసారిగా రష్మిక- విజయ్ కలిసి నటించారు. లవ్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వీరు చూడముచ్చటగా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నాటి నుంచి విజయ్ - రష్మికలు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ మరోసారి కలిసి నటించింది ఈ జంట. అప్పటికే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని.. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. వెకేషన్స్‌కి సీక్రెట్‌గా వెళ్తున్నారని గుసగుసలు వినిపించాయి. ఎయిర్‌పోర్టులు, రెస్టారెంట్స్‌లలో విజయ్ దేవరకొండ- రష్మికలు ఉన్న ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతుండటంతో ఈ పుకార్లుకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

వరుస విజయాలతో రష్మిక
విజయ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా రష్మిక ప్రత్యక్షం కావడం.. ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ఈవెంట్‌లకు రష్మిక చీఫ్ గెస్ట్‌గా వెళ్లడం వంటి పరిణామాలు అనేక అనుమానాలను కలిగిస్తోంది. రష్మిక కెరీర్ పరంగా విజయ్‌ని దాటేసి నేషనల్ క్రష్‌గా దూసుకెళ్తోంది. పుష్ప సిరీస్, యానిమల్, ఛావా లేటెస్ట్‌గా కుబేరతో ఆమె లక్కీ హ్యాండ్‌గా మారిపోయారు. ఇండియాలో ఏ హీరోయిన్‌కు లేని రేంజ్‌లో సక్సెస్ రేట్‌తో దర్శక నిర్మాతలు రష్మిక ఇంటి ముందు క్యూకడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్, హిందీలో థామ సినిమాలలో రష్మిక నటిస్తున్నారు.
హిట్ కోసం విజయ్ పోరాటం
మరోవైపు విజయ్ కెరీర్ చూస్తే నత్తనడకన సాగుతోంది. వరుస హిట్స్‌తో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ దేవరకొండకు తర్వాత లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు దారుణమైన ఫలితాలు తీసుకొచ్చాయి. చివరికి రేసులో నిలబడాల్సిన పరిస్ధితుల్లో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. కెరీర్‌లో ఇప్పటి వరకు ట్రై చేయని క్యారెక్టర్‌లో విజయ్ ఇందులో నటించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లలో ఆయన పడిన కష్టం కనిపించింది.
కింగ్డమ్ రిజల్ట్‌పై రష్మిక పోస్ట్
ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని, వాయిదాలు పడిన ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుంచి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో కింగ్డమ్ యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది. అడ్వాన్స్ బుకింగ్, బుకింగ్స్‌లో కింగ్డమ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తుండటంతో విజయ్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ హీరో హిట్ కొట్టాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా కింగ్డమ్ రిజల్ట్‌పై రష్మిక మందన్న పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ రిప్లయ్
నిన్ను ప్రేమించేవాళ్లకి కింగ్డమ్ విజయం ఎంత కీలకమైందో నాకు తెలుసని.. మనం హిట్ కొట్టాం అంటూ రష్మిక హర్షం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే మనం హిట్ కొట్టామంటూ పోస్ట్ పెట్టారు. దానికి లవ్ ఎమోజీ జత చేశారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. మరోసారి విజయ్, రష్మికలు తమ బంధంపై ఓపెన్ అయ్యారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











