Animal Trailer: మోస్ట్ వైలెంట్‌గా యానిమల్ ట్రైలర్.. నాన్న మీద ఈగ వాలితే ఢిల్లీనే తగలబెట్టేస్తాడట!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరోహీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం యానిమల్. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి ముందు నుంచే పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అదీ పాన్ ఇండియా మూవీ అనే సరికి అంతా ఎత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి విడుదల అయిన టీజర్, పాటలు పెద్ద ఎత్తున రికార్డు క్రియేట్ చేయగా.. డిసెంబర్ ఒకటో తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది.
కాసేపటి క్రితమే విడుదల అయిన యానిమల్ ట్రైలర్ కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మోస్ట్ వైలెంట్ గా ఉన్న ఈ ట్రైలర్ నిజంగా అదిరిపోయిందనే చెప్పొచ్చు. ఈ సినిమాలో తండ్రిపై హీరోకు ఉన్న ప్రేమను అద్భుతంగా చూపించారు. అలాగే యాక్షన్ సీన్లు కూడా అదిరిపోయాయి. గతంలో విడుదల అయిన పాటలు, టీజర్ చూస్తే అమ్మాయి ప్రేమ, రొమాన్స్, యాక్షన్ మాత్రమే కనిపించగా.. ఈ ట్రైలర్ తో తండ్రిపై ఓ కొడుకున్న ఉన్న పిచ్చి ప్రేమను చూపించారు. తండ్రికోసం ఏమైనా చేసే కొడుకుగా రణ్ బీర్ కపూర్ యాక్టింగ్ ఇరగదీశారు.

ట్రైలర్ ప్రారంభంలో పెద్ద జుట్టుతో.. అపరిచితుడు సినిమాలో రాములా కనిపిస్తాడ రణ్ బీర్ కపూర్. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పెద్ద జుట్టు పెద్ద బొట్టుతో తండ్రితో మాట్లాడుతూ కనిపిస్తాడు. తాను ఐదో తరగతి చదివేటప్పుడు మైఖేల్ జాక్సన్ కౌన్సిల్ జరిగిందని.. అప్పుడు తన ఫ్రెండ్స్ అంతా అక్కడికి వెళ్తే తాను మాత్రమే వెళ్లకుండా.. తండ్రి బర్త్ డే కోసం ఇక్కడే ఉండిపోయినట్లు చెప్తాడు. మీరేం చేయాల్సిన అవసరం లేదు ఆరోజును మనం ఇప్పుడు రీప్లేస్ చేద్దామంటూ చెప్పుకొస్తాడు. మీరు నాన్నా, నాన్నా అనండి సరిపోతుంది ఇంకే చేయాల్సిన పని లేదంటూ.. పరిగెట్టాడు రణ్ బీర్ కపూర్. సిగరెట్ తాగుతూ.. తండ్రి ముందు నడవగా.. ఆయన తండ్రి నాన్నా, నాన్నా అని పిలిచాడు.
అంతే.. ఒక్కసారిగా గట్టిగా వినిపిస్తోంది.. నాకేం చెవుడు లేదంటూ రణ్ బీర్ మాట్లాడిన తీరు చూస్తుంటే తాను ఎంతగా హర్ట్ అయ్యాడో అర్థం అవుతుంది. ఇక ఆ తర్వాత స్కూల్ యూనిఫారమ్ లో ఆ తర్వాత యంగేజ్ లో కనిపిస్తాడు. తండ్రికి షార్ట్ హెయిర్ అంటే ఇష్టమని జుట్టు కత్తిరించుకుంటానని చెప్పడం, నీకు జుట్టుగా పెద్దగా ఉంటే కూడా బాగుంటుంది తండ్రి అనగానే మళ్లీ పెంచుకుంటానని చెప్పడం చూస్తుంటే.. తండ్రి మీద ఆయనకు పిచ్చి ప్రేమ ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇక ఆ తర్వాత వైలెంట్ యాక్షన్ సీన్లు చూపించారు. ఇదంటా చూస్తుంటే తన తండ్రికోసమే రణ్ బీర్ కపూర్ ఆ ఫైట్లు చేసినట్లు తెలుస్తోంది.
రష్మిక మందన్నా.. చిన్నప్పటి నుంచి నువ్వు మీ నాన్న మీదు పెంచుకున్నది ప్రేమ కాదు.. అదో రోగం అని చెప్పగా.. రణ్ బీర్ కపూర్ ఆమె పీక పట్టుకుంటాడు. ఆ తర్వాత ఎవరో రణ్ బీర్ తండ్రిని కాల్చినట్లు చూపిస్తారు. ఇక ఆ తర్వాత భార్యా, పిల్లలతో పాటు రణ్ బీర్ రావడం చూపిస్తారు. నేను తిరిగొచ్చేశాను తాతయ్యా, ఎక్కడికి వెళ్లనంటూ ప్రేమను చూపిస్తాడు. ఆప్యాయంగా హత్తుకుంటాడు. ఆ తర్వాత అందరి ముందు తన తండ్రిని చంపినవాడిని, బల్ వీర్ సింగ్ ను షూట్ చేసినవాడిని గొంతుకోసి చంపుతానని మాటివ్వడం చాలా ఎమోషనల్ గా అనిపించింది.
ఇక ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ ను చాలా వైలెంట్ గా చూపించారు. ఘోస్ట్ తో నేను ఫైట్ చేయను, వాటిని మింగేస్తానంటూ ఆయన చెప్పిన డైలాగ్ లు అదిరిపోయాయి. ఇక మీమీద ఈఘ వాలినా సరే ఢిల్లీనే తగులబెట్టేస్తానని చెప్పిన విధానం కూడా ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత అద్భుతమైన మెషీన్ గన్ ను రణ్ బీర్ వాడుతుండగా చూపించారు. ఇక చివర్లో వచ్చిన పాట అయితే ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మీరూ ఓసారి యానిమల్ ట్రైలర్ చూసేయండి.


Click it and Unblock the Notifications











