తీరిక లేకుండా అదే పని.. ఒత్తిడి పెరుగుతోంది.. ఇక నా వల్ల కాదంటున్న రష్మిక మందన్న

ఏదైనా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటుంది 'ఛలో' బ్యూటీ రష్మిక మందన్న. అనతికాలం లోనే తెలుగు తెరపై టాప్ హీరోయిన్ స్థాయిలో క్రేజ్ కొట్టేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది ఈ కన్నడ భామ. ఛలో అంటూ పలకరించి గీతగోవిందం సినిమాతో యూత్ ఆడియన్స్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్న ఈమె చాలా ఓపెన్‌గా తన కెరీర్‌కి సంభందించిన కొన్ని విషయాలు చెప్పింది. వివరాల్లోకి పోతే..

Recommended Video

IFFI 2019 : Rashmika Mandanna About How She Deal With Trolls
రష్మిక మందన్న ట్రెండ్.. ఇదీ పరిస్థితి

రష్మిక మందన్న ట్రెండ్.. ఇదీ పరిస్థితి

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం రష్మిక మందన్న ట్రెండ్ నడుస్తోంది. గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె చేసిన రొమాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో రష్మిక వెంటే పడుతున్నారు నేటి దర్శకనిర్మాతలు. ఈ మేరకు ఆమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

రష్మిక మందన్న బిజీ బిజీ.. మహేష్ బాబు, అల్లు అర్జున్‌లతో

రష్మిక మందన్న బిజీ బిజీ.. మహేష్ బాబు, అల్లు అర్జున్‌లతో

ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో, నితిన్ సరసన భీష్మ సినిమాలో నటిస్తోంది రష్మిక. అలాగే మరికొద్ది రోజుల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ సినిమాలోను రష్మికనే హీరోయిన్. ఇంకా తమిళ, కన్నడ చిత్రసీమలోనూ వరుస ఆఫర్స్‌తో బిజీ అయింది రష్మిక.

ఇలా తీరిక లేకుండా అదే పని

ఇలా తీరిక లేకుండా అదే పని

ఇప్పటి వరకూ జరిగింది పక్కనబెడితే.. ఇలా తీరిక లేకుండా సినిమాలు చేయడం ఇక తన వల్ల కాదని అంటోంది రష్మిక. సినిమాలు చేసి చేసి రష్మిక బాగా అలసి పోయిందట. విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తున్న కారణంగానే రెండు నెలల గ్యాప్ లోనే నాలుగు సార్లు అస్వస్థతకు గురయ్యానని రష్మిక చెబుతుండటం గమనార్హం.

 కనీస విశ్రాంతి కూడా ఉండడం లేదు

కనీస విశ్రాంతి కూడా ఉండడం లేదు

గత మూడేళ్లలో బిజీ షెడ్యూల్స్ కారణంగా కనీస విశ్రాంతి కూడా ఉండడం లేదని రష్మిక తెలిపింది. విశ్రాంతి కోసం తనకు తానుగా కాస్త స్పీడ్ తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు ఈ సందర్బంగా ఆమె పేర్కొంది. ఈ మేరకు వచ్చే ఏడాది నుండి కాస్త మెల్లగా సినిమాలు చేసి కావాల్సినంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటోందట రష్మిక.

ఒత్తిడి పెరుగుతోంది

ఒత్తిడి పెరుగుతోంది

బిజీ షెడ్యూల్స్ కారణంగా శరీరం మరియు మైండ్ చాలా ఒత్తిడికి గురవు తున్నాయని అంటోంది ఈ కన్నడ భామ. దీంతో భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని రష్మిక చెబుతోంది.

ఒప్పుకున్నవన్నీ పూర్తి కాగానే

ఒప్పుకున్నవన్నీ పూర్తి కాగానే

ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి కాగానే.. ఆ తర్వాత కాస్త మెల్లగా సినిమాల ఎంపిక చేసుకుంటానని చెప్పుకొచ్చింది రష్మిక. సినిమా సినిమాకు గ్యాప్ ఉండేలా ప్రయత్నిస్తానంటూ ఆమె పేర్కొంది.

స్టార్ హీరోలయితే ఓకే.. లేదంటే

స్టార్ హీరోలయితే ఓకే.. లేదంటే

ఈ మేరకు కేవలం స్టార్ హీరోలయితేనే ఓకే అనాలని డిసైడ్ అయిందట రష్మిక. పైగా రెమ్మ్యూనరేషన్ విషయంలోనూ బాగా డిమాండ్‌గా ఉంటోందట. చూడాలి మరి ముందు ముందు ఈ అమ్మడి స్పీడ్ ఎలా ఉండనుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X