Rashmika Mandanna రష్మిక మందన్నకు షాకింగ్ రెమ్యునరేషన్.. యానిమల్‌కు ఎన్ని కోట్లు తీసుకొన్నదంటే?
ఛలో సినిమాతో తెలుగు సినీ రంగంలో నికి ఎంట్రీ ఇచ్చి.. గీతా గోవిందం సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కూర్గ్ భామ రష్మిక మందన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కూడా ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిందీ నేషనల్ క్రష్. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరూ, పుష్ప సినిమాల్లో తనదైమ మార్క్ చూపించిన ఈమె.. తాజాగా యానిమల్ సినిమాలోనూ నటించింది. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సరసన కనిపించింది.
లవర్ గా, భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా అద్భుతమైన నటన కనబర్చిన రష్మిక మందన్నాకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. లక్షలాది మంది సినీ అభిమానులు ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వేధికగా పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొంత మంది సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నప్పటికీ.. ఎక్కువగా మాత్రం ప్రశంసలే వస్తున్నాయి. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దాదాపు 100 కోట్ల రూపాయలతో తెలకెక్కించిన ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గా కనిపించిన రష్మిక రెమ్యునరేషన్ పై కూడా ప్రస్తుతం చర్చ సాగుతోంది.

వారం రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లను రాబట్టిన యానిమల్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా భారీగానే పారితోషికం పుచ్చుకుందనే టాక్ నడుస్తోంది. అయితే ఆమె నటనకు మరింత ఎక్కువగా ఇచ్చినా తప్పులేదని చాలా మంది చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు రష్మిక ఎంత మేర రెమ్యునరేషన్ పుచ్చుకుందో.. గతంలో కూడా ఎంత తీసుకునేదో మనం ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బాలీవుడ్ సినిమాల్లోనూ అగ్రహీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో ఒక్కో సినిమాకు తన క్యారెక్టర్ ను బట్టి 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకూ పుచ్చుకునేదట. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా కోసం మాత్రం 7 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసిందట. బోల్డ్ సీన్స్, కిస్సింగ్ సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమె ఇంత ఎక్కువగా అడగడం.. అందుకు దర్శక, నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్నా కనబర్చిన నటనకు అంతకంటే ఎక్కువే ఇచ్చిన తప్పేమీ లేదని చాలా మంది చెప్పుకొస్తున్నారు.

ప్రస్తుతం రష్మిక మందన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ అనే మరో సినిమాలో చేసేందుకు కూడా ఓకే చెప్పింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. రష్మిక మరికొన్ని రోజుల్లోనే అందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే.. రష్మిక మందన్నా రేంజ్ పెరిగిపోవడం ఖాయం.


Click it and Unblock the Notifications











