హీరో కార్తీతో రష్మిక మందన రొమాన్స్!
కన్నడ బ్యూటీ రష్మిక మందన టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ కు రష్మిక పరిచయం అయింది. ఆ చిత్రం విజయం సాధించడంతో గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశాన్ని రష్మిక దక్కించుకుంది. గీత గోవిందం చిత్రంలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. గీత గోవిందం ఘనవిజయం సాధించడంతో రష్మికకు యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
రష్మిక మందన ప్రస్తుతం కుర్రకారుకు కలల రాణి. ఈ ముద్దు గుమ్మ కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతోంది. హీరో కార్తీ సరసన ఓ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెమో ఫేమ్ భాగ్యరాజ్ దర్శత్వంలో కార్తీ నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో కార్తీకే జోడిగా రష్మికని ఫైనల్ చేశారట. ఇటీవల విడుదలైన కార్తీ చిత్రం దేవ్ నిరాశపరిచింది.

భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్ ఆర్ ప్రభు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువత హృదయాలు దోచుకున్న రష్మిక తమిళంలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











