Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భీష్మ రొమాంటిక్ అప్డేట్.. రష్మిక నడుము చూసి నితిన్ పరేషాన్.. వైరల్ వీడియో
'ఛలో' అంటూ సూపర్ హిట్స్ తమ కాటాలో వేసుకున్నారు హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈ ఇద్దరికీ ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ ఇద్దరూ మరోసారి జత కలిసి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్‌తో కలిసి భీష్మ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న 'భీష్మ' మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో రష్మిక- నితిన్ జోడీ బాగా ఆకట్టుకోనుందని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే వీరిద్దరిపై విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా భీష్మ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ వీడియో ద్వారా ఇటు రష్మిక అభిమానులకు, అటు నితిన్ అభిమానులకు రొమాంటిక్ ట్రీట్ ఇచ్చారు. రష్మిక నడుము చూసి పరేషాన్ అవుతున్న నితిన్.. చివరకు తట్టుకోలేక ఆమెతో చించేశారు అని సైగ చేస్తూ చెప్పడం ఈ వీడియోలో హైలైట్ అవుతోంది. ఈ వీడియోతో యూత్ ఆడియన్స్‌కి బుట్టలో వేసుకుంది చిత్రయూనిట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భీష్మ ఫస్ట్ గ్లింప్స్, ఒక్కసారిగా సినిమాపై హైప్ పెంచేసింది.
సింగిల్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహతి సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ప్రేమకథా చిత్రంగా వైవిద్యభరితమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ అంచనాలు పెంచేస్తోంది భీష్మ యూనిట్.