తెర వెనుక జరిగేవన్నీ బయటపెడతా.. హీరో, దర్శకుడికి రష్మిక మందన్న బెదిరింపులు

Recommended Video

Rashmika Mandanna Comments On Nithiin And Venky Kudumula || Filmibeat Telugu

ఛలో అంటూ తెలుగు తెరపై అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్న ఆ తర్వాత క్రేజీ హీరోయిన్‌గా మారింది. అతి తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ మెయిన్‌టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె నితిన్ సరసన భీష్మ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తాజాగా ట్విట్టర్ వేదికగా హీరో నితిన్, భీష్మ మూవీ డైరెక్టర్ వెంకీ కుడుములను బెదిరించింది. ఇంతకీ వారిద్దరినీ ఆమె బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు జరిగిందేంటి? వివరాల్లోకి పోతే..

నితిన్‌కి జోడీగా వెంకీ కుడుములతో

నితిన్‌కి జోడీగా వెంకీ కుడుములతో

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా భీష్మ. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నితిన్, వెంకీ, రష్మిక మధ్య ఆసక్తికర సంభాషణ నడించింది.

రష్మిక పేరు ప్రస్తావిస్తూ వెంకీ కుముల

షూటింగ్‌లో భాగంగా సెట్స్‌పై నితిన్‌తో కలిసి సరదాగా కూర్చొని డిస్కషన్ చేస్తున్న పిక్ షేర్ చేసిన డైరెక్టర్ వెంకీ కుడుముల.. ''నేను నితిన్‌ అన్న డీప్‌ డిస్కషన్‌లో ఉన్నాం. వెనక రష్మిక ఏం చేస్తోందో మాత్రం మాకు తెలియదు'' అని ట్వీట్‌ చేశారు.

మీ ఇద్దరి ఫొటోలు బయటపెట్టనా? అంటూ రష్మిక

మీ ఇద్దరి ఫొటోలు బయటపెట్టనా? అంటూ రష్మిక

దీంతో ఈ ట్వీట్ చూసిన రష్మిక వెంటనే రియాక్ట్ అయింది. 'ఏయ్‌.. సెట్స్‌లో మీ ఇద్దరూ ఎవ్వరికీ తెలియకుండా ఏం చేస్తుంటారో నెటిజన్లకు కూడా చూపించమంటారా? మీ ఇద్దరి ఫొటోలు బయటపెట్టనా?' అని ఫన్నీ రిప్లై పెట్టింది. దీనిపై వెంకీ కుడుముల తిరిగి ప్రతిస్పందిస్తూ.. 'పోస్ట్‌ చెయ్. మేమిద్దరం ఏం చేసేవాళ్లమో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది' అన్నాడు.

ఎంటరైన నితిన్.. తెర వెనుక ఏం జరుగుతోందో చూపిస్తా

రష్మిక, వెంకీల నడుమ ఈ సంభాషణ నడుస్తుంటే మధ్యలో హీరో నితిన్‌ కూడా ఎంటరయ్యాడు. ''సెట్స్‌ లోపలైనా, బయటైనా మేం కేవలం పని గురించే మాట్లాడుకుంటాం. కానీ, వెంకీ.. మీరు మధ్యలో ఎవరితోనో ఫేస్‌టైమింగ్ చేస్తుంటారు'' అని అన్నాడు. దీనిపై రష్మిక మళ్ళీ స్పందిస్తూ.. ''ఏయ్‌ నితిన్‌.. నువ్వు ఆగు. తెర వెనుక ఏం జరుగుతోందో నేను అందరికీ చూపిస్తాను. ఎప్పటికీ మేం సింగిలే అంటుంటారు. ఆ ట్యాగ్‌టైన్‌ కేవలం నాకు మాత్రమే సూటవుతుంది. నీకు వెంకీ, వెంకీకి నువ్వు తోడుగా ఉన్నారు'' అంటూ కాసేపు నెటిజన్లను ఎంటర్‌టైన్ చేశారు ఈ ముగ్గురు.

చాలా సాఫ్ట్‌గా నితిన్

చాలా సాఫ్ట్‌గా నితిన్

ఇటీవలే 'భీష్మ' సినిమా నుంచి నితిన్ అఫీషియల్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్‌లో నితిన్ చాలా సాఫ్ట్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. నితిన్ లుక్‌ని బట్టి చూస్తే ఈ సినిమా క్లాసీగా ఫీల్ గుడ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X