నన్నలా అన్నారంటే సినిమాలు మానేసి కూర్చుంటా.. రష్మిక మందన్న
కన్నడ భామ రష్మిక మందన్న వెండితెరపై ఎంత చురుకుగా ఉంటుందో.. బయట జరిగే మీడియా సమావేశాల్లో కూడా అంతే చురుకుగా మాట్లాడుతుంటుంది. ఆమె ప్రెసెంట్ మూవీ 'డియర్ కామ్రేడ్' ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు చెప్పింది.
తెలుగు సినిమా తెరపై కనిపించిన కొద్ది రోజుల్లోనే మహేష్‌బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రావడం మీ అదృష్టమేనా? అని మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించిన రష్మిక మందన్న.. తనను ఎవరన్నా లక్కీ స్టార్ అనడం గానీ, అదృష్టం వల్లే ఈ స్థాయికి వచ్చారు అనడం గానీ చేస్తే.. వెంటనే సినిమాలు మానేసి కూర్చుంటానని పేర్కొంది. ఒకవేళ అప్పుడు కూడా అవకాశాలు ఇలాగే వస్తే నాది అదృష్టమని నమ్ముతా.. అంతేకానీ ఇలా ఊరికే అదృష్టమని అంటే ఊరుకోనని తెలిపింది. అందరూ అనుకున్నట్లుగా హీరోయిన్లకు సినిమా అవకాశాలు ఊరికే రావని, చాలా హార్డ్ వర్క్ చేయాలని చెప్పింది రష్మిక.

ఛలో సినిమాతో వెండితెరపై కాలుమోపిన ఈమె ఆ తర్వాత గీత గోవిందం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జులై 26 న విజయ్ దేవరకొండ సరసన నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో, అల్లు అర్జున్ సరసన మరో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక మందన్న. ఈ మూడు సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక రష్మిక టాలీవుడ్ టాప్ రేంజ్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయమే.


Click it and Unblock the Notifications











