twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మికతో మహేష్ బాబు లిప్‌లాక్.. పెద్ద సాహసమే చేశారట! బయటకు రావొద్దు అనుకున్నారు కానీ..

    |

    లిప్‌లాక్ సీన్లకు పెట్టింది పేరు 'ఛలో' బ్యూటీ రష్మిక మందన్న. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన లిప్‌లాక్ చూసి ఫిదా అయ్యారు యూత్ ఆడియన్స్. లిప్‌లాక్ అంటే ఇదీ! అన్నట్లుగా రొమాంటిక్ ప్రియులకు స్పెషల్ కిక్ ఇచ్చింది రష్మిక. ఇదే కంటిన్యూ చేస్తూ తాజాగా మహేష్ బాబు సినిమాలోనూ ఘాటు లిప్‌లాక్ సీన్‌లో పాల్గొందట రష్మిక మందన్న.

    'సరిలేరు నీకెవ్వరు' మహేష్ బాబు

    'సరిలేరు నీకెవ్వరు' మహేష్ బాబు

    మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్.. ఇక కేరళ బయల్దేరబోతోంది. అక్కడి అందమైన ప్రదేశాల్లో మరికొన్ని సీన్స్ షూట్ చేయనున్నారట.

    మహేష్ బాబు సీక్రెట్ లీక్.. గోప్యంగా ఉంచాలనుకుంటే!

    మహేష్ బాబు సీక్రెట్ లీక్.. గోప్యంగా ఉంచాలనుకుంటే!

    'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మిక మందన్న హాట్ లిప్‌లాక్ సీన్ ఒకటుందట. ఇందులో ఎంతో ఘాటుగా రష్మిక మందన్నను మహేష్ లిప్‌లాక్ చేయడం చూపిస్తారట. ఇప్పటికే ఈ సీన్ షూట్ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని చిత్రయూనిట్ భావించినప్పటికీ, అది ఎలాగోలా బయట పడిందని టాక్.

    పాటలో భాగంగా రష్మికను..

    పాటలో భాగంగా రష్మికను..

    తాజాగా అందిన సమాచారం మేరకు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని ఓ పాటలో రొమాంటిక్ సీన్స్ పీక్స్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహేష్ రష్మికలపై ఈ లిప్‌లాక్ సీన్‌ను షూట్ చేశారట మేకర్స్. అనిల్ రావిపూడి స్టైల్ కిక్ ఇచ్చేలా ఈ సీన్ రూపొందించారని అంటున్నారు.

    సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ ట్రీట్

    సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ ట్రీట్

    గతంలో మహేష్ బాబు కొందరు హీరోయిన్స్‌తో లిప్ లాక్ సీన్స్ చేసినప్పటికీ.. ఇంత ఘాఢమైన లిప్‌లాక్ సీన్‌లో ఎప్పుడూ నటించలేదని టాక్. ఈ మధ్య కాలంలో యూత్ ఆడియన్స్ ఎక్కువగా ఇలాంటి సీన్స్ కోరుకుంటున్న కారణంగా.. తన ఫాలోయింగ్ నిలబెట్టుకోవడానికి మహేష్ ఈ సీన్ చేయడానికి సాహసం చేసినట్లుగా ఫిలిం నగర్ టాక్. ఏదేమైనా రష్మికతో మహేష్ లిప్‌లాక్ అనే టాక్ సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చింది.

    ఆర్మీ ఆఫీసర్.. భారతి

    ఆర్మీ ఆఫీసర్.. భారతి

    సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు 'అజయ్' అనే ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్న లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, భారతి రోల్ పోషిస్తోంది. బండ్ల గణేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. భారీ అంచనాలు నడుమ జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Rashmika Mandanna is doing now Rashmika Mandanna movie with Mahesh Babu. In this movie Rashmika Mandanna liplock with Mahesh Babu seen will be hilighted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X