Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్‌పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
రొమాంటిక్‌గా ఉండాలి.. వయసుతో పనేంటి? రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్
కన్నడ భామ రష్మిక మందన్న జోరు మాములుగా లేదు. 'ఛలో' అంటూ తెలుగు తెరపై కాలుమోపిన ఈ భామకు పట్టిందల్లా బంగారం అవుతోంది. వరుస ప్రాజెక్టులు.. అన్నీ విజయాలు.. అన్నట్లుగా సాగిపోతోంది రష్మిక ట్రాక్ రికార్డ్. యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని క్రేజీ హీరోయిన్ గా మార్క్ వేసుకున్న రష్మిక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ రష్మిక చెప్పిందేంటి? వివరాల్లోకి పోతే..
యాక్టర్ రక్షిత్‌తో నిశ్చితార్థం.. హాట్ టాపిక్
యాక్టర్ రక్షిత్ శెట్టి, రష్మిక మందన్నల నిశ్చితార్థం 2017 సమ్వత్సరంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం కాన్సిల్ అయింది. దీంతో రష్మిక పెళ్లి టాపిక్ అనేది సినీ లోకంలో హాట్ టాపిక్ గా మారింది. రష్మిక ఎక్కడికెళ్లినా పెళ్లి విషయం టచ్ చేయకుండా ఉండటం లేదు మీడియా ప్రతినిధులు.
డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్‌లో ఉండగా
ప్రస్తుతం తన కొత్త సినిమా డియర్ కామ్రేడ్ ప్రమోషన్ కార్యాక్రమాల్లో బిజీగా ఉంది రష్మిక మందన్న. ఈ మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనగా మరోసారి ఆమెకు పెళ్లి ప్రశ్న ఎదురైంది. మీకు కాబోయే కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు భావిస్తున్నారంటూ మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన రష్మిక ఆసక్తికర సమాధానం చెప్పింది.
వయసుతో పనేంటి?
తనకు కాబోయే వాడు నిజాయితీగా ఉండాలని, అతడి ప్రవర్తన తనకు నచ్చాలని పేర్కొంది రష్మిక. అన్నింటికన్నా మించి అతడికి మంచి మనసు ఉండాలని చెప్పింది. అతనితో ఉండే సమయం అలా జాలీగా గడిచిపోయినట్లు అనిపించాలని, తన దృష్టిలో రొమాంటిక్‌గా ఉండేందుకు వయసుతో పనిలేదని రష్మిక చెప్పుకొచ్చింది.
డియర్ కామ్రేడ్ మూవీ
భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ మూవీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. క్రేజీ జోడీగా ఈ జోడీ పేరుండటం కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. జులై 26 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.