Rashmika Mandanna Engagement: రష్మిక మందన్నతో విజయ్ దేవర కొండ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?
యంగ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న రూమర్లకు తెర దించారు. గత కొద్దికాలంగా సన్నిహితంగా ఉంటున్న ఈ ఇద్దరు సీక్రెట్‌గా ఇరు కుటుంబా సమక్షంలో నిశ్చితార్థం జరిపించుకొన్నారు. దాంతో ఈ ఇద్దరు త్వరలోనే దంపతులుగా మారనున్నారు. అయితే పక్కా ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ శుభ కార్యాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. కేవలం ఇండస్ట్రీలోని అత్యంత సన్నిహితులు, స్నేహితులు, సమీప బంధువులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ వేడుకకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరు గీతా గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన పరిచయం స్నేహంగా మారింది. అనంతరం వారిద్దరూ డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఇద్దరూ ఒకరినొకరిని అర్ధం చేసుకొని తమ బంధాన్ని మరింత బలంగా మార్చుకొన్నారు.

అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య జరిగిన డేటింగ్ వ్యవహారం మీడియాలో అనేక సందేహాలను రేకెత్తించింది. అయితే తమ మధ్య ఉన్న అఫైర్ గురించి వారు ఎన్నడూ కూడా స్పందించకపోగా.. చాలా డిప్లోమాటిక్'గా మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో వారిద్దరూ పరోక్షంగా తమ బంధం గురించి కన్ఫార్మ్ చేయడంతో త్వరలోనే వారి పెళ్లి జరుగుతుందనే విషయం స్పష్టమైంది.
అయితే దసరా పండుగ సందర్భంగా మంచి రోజును చూసుకొని శుక్రవారం అక్టోబర్ 3వ తేదీన విజయ్, రష్మిక నిశ్చితార్థం చేసుకొన్నారు. ఇరు కుటుంబాల ఆమోదం, అంగీకారం మేరకు వారి ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో ప్రైవేట్ అఫైర్‌గా జరిగింది. వచ్చే ఏడాది ఇద్దరి వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ వార్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం 2026 సంవత్సరం ఫిబ్రవరిలో వీరిద్దరి వివాహం జరుగనున్నది.
ఇక రష్మిక విషయానికి వస్తే.. గతంలో కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగి బ్రేకప్ జరిగింది. అప్పటి నుంచి ఆమె పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది. కేవలం తన కెరీర్ కోసమే ఆమె తన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకొన్నారు. ఆ తర్వాత ఆమె దేశవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణించి నేషనల్ క్రష్‌గా మారారు. ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్లలో అగ్రస్థానంలో ఉన్నారు.
రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల పుష్ప 2 సినిమాతో సంచలనం విజయం అందుకొన్నారు. ఆ తర్వాత ఛావా చిత్రంతో బ్లక్ బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం తమ్మా అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నది. ఇక విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ఇటీవలే రిలీజై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











