లైవ్‌లో అలాంటి ప్రశ్న.. ఆ విషయాన్ని విజయ్ దేవరకొండనే అడగండి అంటూ రష్మిక సింపుల్ ఆన్సర్!

రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ జంటపై వస్తున్న రూమర్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే గీత గోవిందం సినిమాతో వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారో అప్పటి నుంచి జనాల్లో మంచి క్రేజ్ అందుకున్నారు. ఎప్పుడైనా సరే ఇద్దరు కలిసి ఫొటో దిగితే నిమిషాల్లోనే కొత్త తరహా స్టోరీలు పుట్టుకొస్తుంటాయి. ఇక రీసెంట్ గా సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చిన రష్మిక ఒక ప్రశ్నకు ఎవరు ఊహించని విధంగా సమాధానం చెప్పింది.

హడావుడి లేకుండా..

హడావుడి లేకుండా..

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మాములుగా ఉండవు. మొదట వీరు కలిసి నటించిన గీతగోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి హడావుడి లేకుండా కేవలం ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందించారు.

లిప్ లాక్ సీన్ చేయడంతో..

లిప్ లాక్ సీన్ చేయడంతో..

గీతగోవిందం అనంతరం కలిసి నటించిన మరో సినిమా డియర్ కామ్రేడ్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వకపోయినప్పటికి ఇద్దరి జోడిపై పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇక రెండో సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ చేయడంతో వారిపై రూమర్స్ డోస్ ఎక్కువయ్యాయి.

పట్టించుకోవడం మానేశారు

పట్టించుకోవడం మానేశారు

గత కొన్నేళ్ళుగా వీరి మధ్య రిలేషన్ ఉన్నట్లు అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఇద్దరు వాటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. కొన్నాళ్లకు కథనాలు ఎన్ని పుట్టుకొచ్చినా కూడా ఆ తరువాత పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఇక లైవ్ ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నా కూడా పట్టించుకోవడం మానేశారు.

లైవ్ లో అలా అడగడంతో..

లైవ్ లో అలా అడగడంతో..

ఇక ఇటీవల రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఎక్కువగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మీ కాంబినేషన్ లో రాబోతున్న తదుపరి సినిమా ఏమిటని అడిగారు. దీంతో రష్మిక స్వీట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తప్పకుండా కలిసి చేస్తాము. కానీ ఎవరైనా దర్శకుడు తమకు సరిపడే స్క్రిప్ట్ తో మెప్పిస్తే తప్పకుండా కలిసి వర్క్ చేస్తామని వివరణ ఇచ్చింది.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
బాలీవుడ్ లో కూడా బిజీబిజీగా

బాలీవుడ్ లో కూడా బిజీబిజీగా

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను సినిమాతో పాటు అమితాబ్ గుడ్ బై అనే సినిమాలో కూడా నటించనుంది. తెలుగులో మరో రెండు సినిమాలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X