విజయ్ దేవరకొండ కోసం రష్మిక స్పెషల్ పోస్ట్.. ఏమని పిలిచిందో తెలుసా? హాట్ టాపిక్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు మే 9న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చిత్ర పరిశ్రమలోని నటీనటులు, ప్రముఖులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో నేషనల్ క్రష్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా శుభాకాంక్షలు తెలిపింది. అయితే విజయ్ దేవరకొండకు స్పెషల్ పోస్ట్ ద్వారా రష్మిక మందన్న తెలియజేసిన విషెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
విజయ్ దేవరకొండకు రష్మిక విషెస్..
విజయ్ దేవరకొండ తాజాగా 39వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న కాస్త ఆలస్యంగా విష్ చేసిన చాలా స్పెషల్ గా పోస్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్ స్టోరీలో విజయ్ కి సంబంధించిన ఒక అరుదైన ఫోటోలు పంచుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. అయితే విజయ్ దేవరకొండ ను అభిమానులు ముద్దుగా రౌడీ స్టార్ అని, సినీ ప్రముఖులు సెన్సేషనల్ స్టార్ అని పిలుచుకుంటారు. కానీ రష్మిక మందన మాత్రం విజయ్ దేవరకొండకు కొత్త పేరును పెట్టింది. విజ్జూ.. అంటూ క్యూట్ గా పిలిచింది. అలాగే విజయ్ దేవరకొండ తన జీవితంలో ప్రేమ, సంతోషం, సంపద, సక్సెస్ కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు పోస్టు ద్వారా తెలియజేసింది.

సోషల్ మీడియాలో ఇదే టాపిక్..
విజయ్ దేవరకొండ ను రష్మిక మందన్న విజ్జూ అంటూ పిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ను అలా పిలవడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఫోటోలను జత చేసి ఇంట్రెస్టింగ్గా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటున్నారంటూ మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు.
2019 నుంచి రిలేషన్ షిప్?
రష్మిక మందన్న విజయ్ దేవరకొండ జంటగా ఇప్పటి వరకు రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. కానీ ప్రేక్షకుల్లో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎంతగానో ప్రభావం చూపించింది. దాంతో రియల్ లైఫ్ లోనూ వారి పెయిర్ బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతూ వచ్చారు. ఇదే క్రమంలో కొన్నాళ్లుగా వీరిద్దరూ డీప్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం వారిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తున్నారని చెబుతున్నారు. ఈ రూమర్లకు ఆధారంగా సోషల్ మీడియా పోస్టులను చూపిస్తున్నారు. మాల్దీవ్స్, ఇటలీతో పాటు చాలా వెకేషన్ల ఫొటోల్లో వారి బ్యాక్ గ్రౌండ్ లోకేషన్లు సేమ్ ఉండటంతో పుకార్లు పుట్టుకొస్తున్నాయి. 2018లో గీతా గోవిందం, 2019తో డియర్ కామ్రేడ్ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి వీరి డేటింగ్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి.
విజయ్ నెక్ట్స్ మూవీ..
చివరిగా విజయ్ దేరకొండ 'ఖుషి', 'ఫ్యామిలీ స్టార్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఆశించినంతగా ఫలితానివ్వలేదు. ఇక నెక్ట్స్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న 'కింగ్డమ్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో అర్జున్ రెడ్డి వైబ్స్ ను తీసుకోస్తారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం మే30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











