వాళ్లిద్దరంటే నాకు చాలా ఇష్టం.. రష్మిక కామెంట్స్
నితిన్-రష్మిక మందాన్న కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నితిన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా రికార్డులకెక్కబోతోంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన భీష్మ.. బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు కొనసాగిస్తోంది. భీష్మ చిత్రం ఈ రేంజ్ సక్సెస్ సాధించినందుకు గానూ.. వైజాగ్‌లో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది యూనిట్.
ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. థ్యాంక్స్ మీట్‌లో ఈ హీరో మాట్లాడుతూ రష్మికపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రష్మిక గ్రేట్ ట్రాక్ లో ఉందని అన్నాడు. ఈ సంవత్సరం 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ'.. ఇదివరకు 'గీత గోవిందం', 'ఛలో' సినిమాలు చేసిందని గుర్తు చేశాడు. తను మంచి టాలెంట్ ఉన్న నటి అంటూ తనతో చేస్తే సినిమా హిట్టవుతుందని అంటారని చెప్పుకొచ్చాడు. బహుశా త్వరలోనే ఆమెతో కలిసి చెయ్యాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.

హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ.. 'భీష్మ' మంచి సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. నితిన్, వెంకీ వాళ్లిద్దరంటే తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ ఈవెంట్‌కు వరుణ్ తేజ్ వచ్చినందుకు థాంక్స్ చెప్పింది. నిర్మాత నాగవంశీ గారు మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నానని క్యూట్‌గా మాట్లాడింది. భీష్మను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్ అని ముగించింది.


Click it and Unblock the Notifications











