నితిన్ సీక్రెట్స్ బయటపెడతా.. రష్మిక మందన్న కామెంట్స్

యంగ్ హీరోహీరోయిన్లు నితిన్- రష్మిక మందన్న 'భీష్మ' సినిమాతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెట్స్ పై నితిన్- రష్మిక మందన్న జోడీ సరదాగా ఇన్ని రోజులు ఎంజాయ్ చేసింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.

ఈ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వూస్ అటెండ్ చేస్తున్న నితిన్, రష్మిక ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్.. రష్మిక సీక్రెట్ ఒకటి రివీల్ చేశాడు. ఆమె సెట్స్ పై కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పాడు. దీంతో ఈ అంశం వైరల్‌గా మారి ఇటు రష్మికకు, అటు భీష్మ సినిమాకు సూపర్ ప్రమోషన్ తెచ్చిపెట్టింది. ప్రేక్షకులంతా దీని గురించే చర్చించుకోవడంతో అందరి లోనూ భీష్మ ఫీవర్ ఎక్కేసింది.

Rashmika Mandanna sweet warning to Nithiin

కాగా తాజాగా ఈ విషయమై స్పందించిన రష్మిక మందన్న.. నితిన్, తన సీక్రెట్ బయటపెట్టాడు కాబట్టి ఆయన సీక్రెట్స్ కూడా చెప్పేస్తానని తెలిపింది. ఏదైనా సరే తెలుసుకోవాలనే ఉత్సాహం తనలో ఎక్కువగా ఉంటుందని చెప్పింది రష్మిక. ఈ మేరకు ఓ కుక్క బిస్కట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించిందని, అందుకే అలా ఓ ముక్క టేస్ట్ చేశానని ఆమె తెలిపింది. అయితే ఈ విషయాన్ని నితిన్ ఇలా బయటపెట్టేస్తాడని అనుకోలేదని చెప్పింది. అతని సీక్రెట్స్ కూడా చెప్పేస్తా అంటూ సరదా కౌంటర్ వేసింది రష్మిక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X